కొన్ని దేశాలు శక్తుల విస్తరణ ధోరణితో మానవాళికి అత్యవసరం అయిన ఆహార, ఇతరత్రా కీలక సరఫరా వ్యవస్థకు ప్రమాదం ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. జపాన్‌లో జి 7 సదస్సులో ఆయన ఈ విషయం ప్రస్తావించారు. అణగారిన వర్గాలను కేంద్రీకృతంగా చేసుకుని సమ్మిశ్రిత ఆహార వ్యవస్థ అవసరం ఉందని ఆయన తెలిపారు.
సాంకేతిక అత్యవసరం దీని విషయంలో ప్రజాస్వామికత కీలకం అని తెలిపిన ప్రధాని సాంకేతికత ప్రగతికి ప్రజాస్వామ్యానికి మధ్య సముచిత వారధిగా ఉండటం వల్లనే మానవాళికి మంచి జరుగుతుందని పేర్కొన్నారు.
ఆహార వ్యవస్థకు ముప్పు ఏర్పడుతోంది. ప్రత్యేకించి సన్నకారు రైతుల ప్రయోజనాలు కీలకం అని తెలిపారు. కానీ ఎరువుల మార్కెట్లను కంట్రోలు చేసే దేశాలు, శక్తులు ఇందుకు భిన్నంగా వ్యవహరించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు విధాలుగా ఆహార భద్రత సంబంధిత సరఫరా వ్యవస్థలో లోపాలు ఏర్పడుతున్నాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన ఏ దేశం పేరు ప్రస్తావించలేదు.ఆహార వృధాను నివారించాల్సి ఉంది. ఇది మనందరి సమిష్టి బాధ్యత అని తెలిపారు.
ఈ సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ అంతకుముందు హిరోషిమాలో చారిత్రక ఏ-బాంబ్ డోమ్ వద్ద ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. జీ7 సదస్సుకు హాజరైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఎఫ్16 ఫైటర్ జెట్లను సరఫరా చేస్తామని జెలెన్స్కీకి హామీ ఇచ్చారు.