రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు చికిత్స, మృతదేహాలను వారి కుటుంబాలకు చేరవేయడంతోపాటు అత్యవసరంగా ట్రాక్ పునరుద్ధరణ పనులపై దృష్టిపెడుతున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఒడిశా రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా, 900 మందికి పైగా గాయపడినట్టు అధికారికంగా వెల్లడించారు.
కాగా, అనేక ప్రతిపక్ష పార్టీలు కేంద్ర రైల్వే మంత్రి రాజీనామా చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో వైష్ణవ్ ఇది రాజకీయం చేయాల్సిన సమయం కాదని ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఈ పెను విషాదానికి సంబంధించి ప్రతిపక్షాలు రైల్వే మంత్రిని తన పదవికి రాజీనామా చేయాలని పట్టుబడుతున్నాయని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘ప్రస్తుతం నా దృష్టి అంతా రెస్క్యూ రిలీఫ్‌పై పెట్టాలి.’ అని అశ్విని వైష్ణవ్ బదులిచ్చారు.
‘రైలు ప్రమాదంపై విచారణ జరిపేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాము. రైల్వే సేఫ్టీ కమిషనర్ని పిలిపించి, ఆయనతో కూడా విచారణ జరిపి ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాము. ప్రస్తుతం దృష్టి అంతా రెస్క్యూ ఆపరేషన్, గాయపడిన వారికి చికిత్స చేయడం పైనే ఉంది. మరణించిన వారి కుటుంబాలకు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము’ అని తెలిపారు.
అంతకుముందు, కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ “మన వ్యవస్థ సురక్షితంగా ఉందని, ఏదైనా తీవ్రమైన ప్రమాదం జరగదని రైల్వే మంత్రి పదేపదే చెబుతున్నప్పుడు, ఇది ఎలా జరిగింది? లాల్ బహదూర్ శాస్త్రి గతంలో రైలు ప్రమాదంలో తన పదవికి రాజీనామా చేశారు. మేము అలా చేయలేదు. ప్రధాని మోదీ కేబినెట్ నుండి దీనిని ఆశించండి, కానీ అతనికి (అశ్విని వైష్ణవ్) కొంచెం అవమానం ఉంటే, అతను రాజీనామా చేయాలి. అని ట్వీట్ చేశారు.
రైల్వే శాఖను నిర్లక్ష్యం చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రెండుసార్లు రైల్వే మంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ ‘నేను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో అమర్చాలని నిర్ణయించుకున్న యాంటీ కొలిజన్ డివైజ్ ఇప్పుడు లేదు’ అంటూ ధ్వజమెత్తారు.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జీవాలా డిమాండ్ చేశారు. ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావిస్తూ, సిగ్నలింగ్ సిస్టమ్ వైఫల్యంపై ముఖ్యమైన హెచ్చరికను అశ్విని వైష్ణవ్ ఎందుకు నిర్లక్ష్యం చేశారని నిలదీశారు.
రైలు ప్రమాదంలో రెండు ప్యాసింజర్ రైళ్లు, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ , షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. ఒక గూడ్స్ రైలు ఉన్నాయి. కోల్‌కతాకు దక్షిణాన 250 కి.మీ.. భువనేశ్వర్‌కు ఉత్తరాన 170 కి.మీ దూరంలో ఉన్న బాలాసోర్‌లోని బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
కాగా, శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పరిశీలించారు.