తాను తెలుగుదేశం పార్టీలో సభ్యుడిని మాత్రమేనని, తనకు ఎటువంటి పదవులూ లేవంటూ అభివృద్ధి విషయంలో తాను పార్టీలు చూడబోనని, అందరినీ కలుపుకుని ప్రజల కోసం పనిచేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. తద్వారా టిడిపితో బంధం తెంచుకునేందుకు సిద్దమనే సంకేతం ఇచ్చారు.
తనకు ప్రజలే ముఖ్యం అని, ప్రజలు కోరుకుంటే పార్టీ సీటు ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గా గెలుస్తానని చెప్పిన ఆయన వైసిపిలో చేరమని తనకు ఆహ్వానాలు అందుతున్నట్లు వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ ఆఫీసు పెట్టి.. ఎంపీగా తనకు ఆహ్వానం లేదని వాపోయారు.
తమ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెళ్లారని.. పార్టీ కార్యాలయం పెట్టిన వ్యక్తి.. పొలిట్ బ్యూరో సభ్యుడైన నేత తనను పిలవలేదని అంటూ మండిపడ్డారు. నియోజకవర్గ ఇంఛార్జ్‌ల పేరుతో హడావుడి చేసే వాళ్లు గొట్టంగాళ్ల అంటూ వారి ఉనికిని గుర్తించాను అన్నట్లు తేల్చి చెప్పారు.
‘‘టీడీపీ మాహానాడుకు నాకు ఆహ్వానం లేదు. నేను ఒక ఎంపీని… అక్కడ రామ్మోహన్ నాయుడికి తప్ప ఇతర ఎంపీలకు పని లేదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ ఆఫీసు పెట్టారు. ఎంపీగా నాకు అసలు ఆహ్వానం లేదు.. మా పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెళ్లారు. పార్టీ కార్యాలయం పెట్టిన వ్యక్తి నన్ను పిలవలేదు” అంటూ టిడిపితో తనకేమీ సంబంధం అన్నట్లు మాట్లాడారు.
వేరే పార్టీ ఆఫర్లు మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతూ తనకు 100 శాతం మండితే అపుడు దానిపై ఆలోచిస్తానని స్పష్టం చేశారు. అమిత్ షాతో చంద్రబాబు భేటీ ఎందుకో తనకు తెలియదని పేర్కొంటూ చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు.. రావాలని చంద్రబాబు ఏపీ ఫోన్ చేస్తే వెళ్లానని చెప్పారు. ఢిల్లీలో పార్టీ అధినేత చంద్రబాబును బాధ్యతగా వెళ్లి కలిశానని అంటూ బీజేపీ, టీడీపీ పొత్తు పై స్పందించే స్థాయి తనది కాదని తెలిపారు.