ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ఐదు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. బుధవారం రాణి కమలపాటి రైల్వే స్టేషన్లో రెండు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. భోపాల్ నుండి ఇండోర్, ఇండోర్ నుండి జబల్పూర్కి వెళ్లే రైళ్లను మోడీ ప్రారంభించారు. ఇక మరో మూడు రైళ్లు.. మడ్గావ్ (గోవా)- ముంబై, ధార్వార్వాడ్- బెంగళూరు, హతియా – పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈ సందర్భంగా ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.
దీనిపై ప్రధాని మోడీ సోమవారం ట్వీట్ చేశారు. ‘ఈ రైళ్లు మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు అనుసంధానమై అభివృద్ధి చెందేందుకు దోహదపడనున్నాయి’ అని మోడీ తన ట్వీట్లో పేర్కొన్నారు. మధ్యప్రదేశలో జరిగిన ఈ రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభారు పటేల్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింథియాలతోపాటు తదితరులు పాల్గొన్నారు.
కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మోడీ భోపాల్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం హెలికాప్టర్లో రాణి కమలపాటి రైల్వే స్టేషన్‌కి హెలికాప్టర్లో చేరుకోవాలి. కానీ అక్కడ వాతావరణ పరిస్థితులు అననుకూలంగా ఉండడంతో రోడ్డుమార్గంలోనే రైల్వేస్టేషన్‌కి చేరుకున్నారని మధ్యప్రదేశ్ రాష్ట్ర బిజెపి మీడియా ఇన్‌ఛార్జి ఆశిష్ అగర్వాల్ తెలిపారు.
ఇక ఈ కార్యక్రమం అనంతరం మోడీ బూత్ లెవల్ ఉన్న పది లక్షల బిజెపి కార్యకర్తలతో వర్చువల్‌గా సంభాషించారు. ఇక ‘మేరా బూత్ సబ్సే మజ్బూత్’ క్యాంపెన్లో దేశవ్యాప్తంగా బూత్ లెవల్లో సమర్థవంతంగా కృషి చేసిన మూడు వేల మందితో బిజెపి కార్యకర్తలతో మోడీ బుధవారం సంభాషించనున్నట్లు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు విష్ణు దత్ శర్మ పేర్కొన్నారు.