చరిత్రలో ఓ ముఖ్యమైన ఘట్టాన్ని కాపాడేందుకు, దేశాధినేతగా నేతాజీ రాకకు సరిగ్గా 78 సంవత్సరాల తర్వాత బుధవారం ఉదయం 11.30 గంటలకు అండమాన్, నికోబార్ కమాండ్ (సీన్ కాన్)ను కమాండర్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అజయ్ సింగ్ దేశానికి అంకితం చేశారు.
ఈ స్మారకం నేతాజీ నాయకత్వంలోని భారత జాతీయ సైన్యం (ఐఎన్ ఎ) సైనికుల సంకల్పం, వారి అసంఖ్యాక త్యాగాలకు నివాళిగా మాత్రమే కాకుండా, నేతాజీ స్వయంగా ప్రతిష్టించిన విలువలను కూడా గుర్తుచేస్తుంది. “నిష్ఠ, కర్తవ్య ఔర్ బలిదాన్” లేదా “నిబద్ధత, కర్తవ్యం, త్యాగం”. భారత సాయుధ దళాల నైతికత, భారత సైనికుని సంకల్పాన్ని స్పష్టం చేయడం కొనసాగుతుంది.
భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో, డిసెంబర్ 30, 1943 ఒక ప్రత్యేక స్థానాన్ని పొందింది. భారత గడ్డపై తొలిసారిగా పోర్ట్ బ్లెయిర్‌లో జాతీయ జెండాను ఎగురవేసింది అదే రోజు కావడం గమనార్హం. నేతాజీ జనవరి 16, 1941న కోల్‌కతా నుండి బ్రిటిష్ నిఘాను ఎమార్హ్సి తప్పించుకుని దేశం వదిలి వెళ్లారు.
ఆయన దాదాపు మూడు సంవత్సరాల తర్వాత భారత గడ్డపైకి తిరిగి వచ్చారు. పోర్ట్ బ్లెయిర్ ఏరోడ్రోమ్‌లో డిసెంబర్ 29, 1943 ఉదయం 11:30 గంటలకు చేరుకొని, మరుసటి రోజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతిగా, భారత జాతీయ సైన్యానికి సుప్రీం కమాండర్‌గా నేతాజీ దీవులను సందర్శించారు.
1943 చివరి నాటికి భారత జాతీయ సైన్యం భారత గడ్డపై కాలు పెడుతోందని ఆయన చేసిన వాగ్దానానికి ప్రతీకగా నెరవేరింది. ఈ చారిత్రాత్మక పర్యటన సందర్భంగా అండమాన్, నికోబార్ దీవులను “భారతదేశం యొక్క మొదటి విముక్తి భూభాగం”గా ఆయన ప్రకటించారు.
డిసెంబర్ 29, 1943న నేతాజీ చారిత్రాత్మక రాక సర్వశ్రీ ఆనంద్ మోహన్ సహాయ్ (మంత్రి హోదాలో కార్యదర్శి), కెప్టెన్ రావత్ – ఎడిసి, కల్నల్ డీఎస్ రాజు (నేతాజీ వ్యక్తిగత వైద్యుడు)లతో కలసి నేతాజీ చేరుకున్న చారిత్రాత్మక ప్రదేశం ఇప్పుడు అండమాన్, నికోబార్ కమాండ్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ ఉత్క్రోష్ ప్రాంగణంలో ప్రస్తుత రన్‌వేకి దగ్గరగా ఉంది.
జపాన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా భారత జాతీయ సైన్యానికి సుప్రీం కమాండర్‌గా వచ్చిన తర్వాత, నేతాజీకి భారత జాతీయ సైన్యానికి చెందిన సైనికులు ఎయిర్ ఫీల్డ్ వద్ద లాంఛనప్రాయ గౌరవం వందనం చేశారు.
ఈ సందర్భంగా జరిగిన అంకిత వేడుకలో, కమాండర్-ఇన్-చీఫ్ నేతృత్వంలోని భారతదేశానికి చెందిన ఏకైక క్వాడ్ సర్వీసెస్ కమాండ్ సైనికులు, ఇతర సీనియర్ అధికారులు, సైనికులు, కుటుంబాలతో కలిసి భారత జాతీయ సైన్యంలోని సైనికుల త్యాగాలను గౌరవిస్తూ నివాళులర్పించారు. సందర్భానుసారంగా ఈ కార్యక్రమాన్ని సాదాసీదాగా, గంభీరంగా నిర్వహించారు.