ఇస్రో మరో రికార్డు సృష్టించింది. చంద్రుడి దిశగా చంద్రయాన్-3 పయనమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ సెంటర్ నుంచి ఇవాళ ఎల్వీఎం3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. చంద్రయాన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఆ రాకెట్ మోసుకువెళ్లింది. ఇవాళ మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్ గాలిలోకి ఎగిరింది.
ఆ తర్వాత అన్ని దశల్లోనూ ఆ రాకెట్ బూస్టర్లు సక్రమంగా మండాయి. ల్యాండర్, రోవర్‌తో చంద్రయాన్-3 వెళ్తోంది. ఆగస్టు 23వ తేదీన చంద్రుడిపై ఆ ల్యాండర్ దిగే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు పేలోడ్‌లో ప్రత్యేక పరికరాన్ని పంపుతున్నారు.
ఇస్రో ప్రయోగాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో జనం వచ్చారు. సతీశ్ ధావన్ సెంటర్ వద్ద ఉన్న గ్యాలరీ నుంచి ఆ ప్రయోగాన్ని వీక్షించారు. ఇస్రో శాస్త్రవేత్తలు, మాజీ శాస్త్రవేత్తలు కూడా చంద్రయాన్ ప్రయోగాన్ని వీక్షించారు. రూ. 613 కోట్లతో చంద్రయాన్-3 ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. రాకెట్ నుంచి చంద్రయాన్-3 విజయవంతంగా వేరుపడింది.
చంద్రయాన్ 3 ప్రయోగం తొలి దశ విజయవంతంగా ముగిసిందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ప్రకటించారు. ‘కంగ్రాచ్యులేషన్స్ ఇండియా’ అంటూ ఆయన ఈ విజయాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. ఈ మిషన్ లో పాల్గొన్న అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
చంద్రయాన్ విడిపోగానే ఇస్రో శాస్త్రవేత్తలు ఒకరికి ఒకరు విషెష్ చేసుకున్నారు.
కక్ష్యలోకి చంద్రయాన్ ప్రవేశించిందని, అది చంద్రుడి దిశగా తన పయనాన్ని మొదలుపెట్టినట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. పారామీటర్స్ అన్నీ నార్మల్‌గా సాగుతున్నట్లు ఇస్రో శాస్త్రవేత్త తెలిపారు. మూన్ జర్నీ ఇప్పుడే మొదలైనట్లు మిషన్ డైరెక్టర్ పేర్కొన్నారు.
ఇటువంటి ఉద్విగ్న, భావోద్వేగ క్షణాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓ ట్వీట్ చేశారు. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే రోజు 2023 జూలై 14 అని తెలిపారు. మన మూడో లూనార్ మిషన్ చంద్రయాన్-3 తన ప్రయాణాన్ని ప్రారంభించే రోజు ఇది అని వివరించారు. ఈ ప్రధానమైన మిషన్ మన దేశ ఆశలు, స్వప్నాలను మోసుకెళ్తుందని తెలిపారు.కేంద్ర విద్యా శాఖ మత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన ట్వీట్లో, ఇస్రోను కరతాళ ధ్వనులు, కేరింతలతో ప్రోత్సహించే 140 కోట్ల మంది భారతీయుల్లో తానూ ఉన్నానని చెప్పారు. త్వరలోనే చంద్రునిపైన కలుద్దామని తెలిపారు.
మూడు దశల్లో జరిగిన ఈ ప్రయోగంలో చంద్రయాన్ -3 రాకెట్ విజయవంతంగా నింగిలోకి ప్రొపల్షన్ మాడ్యూల్ ను ప్రవేశపెట్టింది. ఈ శాటిలైట్ 40రోజుల పాటు ప్రయాణించి చంద్ర మండలానికి చేరనుంది. ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో ఈ శాటిలైట్ లోని రోవర్ చంద్రునిపై కాలు మోపనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.
మూడుదశల్లో జరిగిన ఈ ప్రయోగంలో చంద్రయాన్ -3 రాకెట్ విజయవంతంగా నింగిలోకి ప్రొపల్షన్ మాడ్యూల్ ను ప్రవేశపెట్టింది. ఈ శాటిలైట్ 40రోజుల పాటు ప్రయాణించి చంద్ర మండలానికి చేరనుంది. ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో ఈ శాటిలైట్ లోని రోవర్ చంద్రునిపై కాలు మోపనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.