వివాహమంటే బంధుమిత్రులతో అంగరంగవైభవంగా జరుగే వేడుక. ఎంతో ఘనంగా జరిగే ఈ వేడుకలు మాత్రం ఇప్పుడు కరోనా సమయంలో అతికొద్ది చుట్టాల మధ్యనే తూతూ మంత్రంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా ప్రవేశంతో ప్రభుత్వాలు వేడుకలను ఎప్పుడు రద్దు చేస్తాయో అర్థంకాక చాలామంది పెళ్లిళ్లను రద్దు చేసుకున్న సంఘటనలెన్నో ఉన్నాయి.
అప్పటివరకు ఎంతో వైభవంగా పెళ్లి చేసుకుందామనుకొని, . దానికోసం ఎంతో ఖర్చు పెట్టుకున్న వారు పూర్తిగా నిరాశత చెందడమే కాక, ఆర్థికంగా చితికిపోయే పరిస్థితులు దాపురించాయి. జీవితంలో అనుకోకుండా జరిగే ప్రమాదాలకు ఆరోగ్య పాలసీలు ఉన్నట్లే.. ఎవరూ ఊహంచని ఇటువంటి హఠాత్ పరిణామాలతో ఆర్థికంగా ఎంతో నష్టపోతున్న వారికీ అందరికీ అందుబాటులోకి వివాహ బీమా వచ్చేసింది.
వివాహ బీమా మొత్తం అనేది పెళ్లి బడ్జెట్‌పై ఆధారపడి ఉంటుంది. బీమాపై విధించే ప్రీమియం మొత్తం బీమా మొత్తంలో 0.7- 2 శాతం మధ్య ఉంటుంది. సుమారు రూ. 10 లక్షల బీమా పొందాలంటే రూ. 7,500 నుంచి రూ. 15,000 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అకస్మాత్తుగా వివాహాన్ని వాయిదా లేదా రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వివాహ బీమా ప్రధాన ఖర్చులను కవర్ చేస్తుంది.
వివాహ బీమాకు సంబంధించిన పాలసీలు సాధారణంగా నాలుగు రకాలుగా ఉంటాయి:
ప్రమాదాల భీమా: వివాహం అనేది బంధుమిత్రులతో చాలామందితో కూడుకున్న వేడుక. అయితే కొన్ని వివాహ వేడుకల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ప్రమాదం లేదా గాయం కారణంగా పెళ్లిలో ఎవరికైనా నష్టం వాటిల్లితే ఈ కేటగిరికి చెందిన భీమా దానిని కవర్ చేస్తుంది.
రద్దు భీమా: పెళ్లిని ఆకస్మికంగా లేదా ఊహించని కారణంతో రద్దు చేయడం వల్ల కలిగే నష్టాలను ఈ కేటగిరి కవర్ చేస్తుంది.
ఆస్తులకు నష్టం: వివాహ వేడుకల్లో కొన్నిసార్లు అనుకోని ప్రమాదం జరిగి ఆస్తి నష్టం వాటిల్లుతుంది. ఈ కేటగిరి అలాంటి నష్టాలను కవర్ చేస్తుంది.
వ్యక్తిగత ప్రమాదం: ఈ కేటగిరీ ప్రమాదం కారణంగా వధూవరుల ఆసుపత్రికి అయ్యే ఖర్చును కవర్ చేస్తుంది.
వివాహానికి సంబంధించిన బీమా ఈ కింది ఖర్చులను కవర్ చేస్తుంద:
1. క్యాటరింగ్ కోసం ఇచ్చిన అడ్వాన్స్.
2. వివాహ వేదిక కోసం ముందస్తుగా చెల్లించిన అడ్వాన్స్.
3. ట్రావెల్ ఏజెన్సీలకు చేసిన ముందస్తు చెల్లింపులు.
4. హౌటల్ గదులను బుక్ చేయడానికి ఇచ్చిన అడ్వాన్స్.
5. వివాహ డెకరేషన్ కు అయిన ఖర్చు
6. మ్యారేజ్ లో ఎంటర్టైన్మెంట్ కోసం ఏర్పాటు చేసిన కచేరి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చిన అడ్వాన్స్ సంగీతం.
7. అలంకరణ మరియు వివాహ సెట్ కే చేసిన ఖర్చు.
వివాహ వేడుకకు ముందుకానీ, జరుగుతున్న సమయంలో కానీ అనూహ్య సంఘటన జరిగితే వెంటనే బీమా స్థంకు సమాచారాన్ని అందించాలి. అనంతరం బీమా కంపెనీ వాస్తవాలను పరిశీలించి, నిర్థారించి ఆ ఖర్చు తిరిగి చెల్లిస్తుంది.
అయితే వివాహ సమయంలో ఉగ్రవాద దాడి, సమ్మె, వధూవరులను కిడ్నాప్ చేయడం, పెళ్లికి వచ్చిన అతిథుల దుస్తులు, వ్యక్తిగత వస్తువులు కోల్పోవడం, వివాహ వేదిక ఆకస్మికంగా అందుబాటులో లేకపోవడం, పాలసీదారుడి ఆదేశానుసారమే వివాహ వేదికకు నష్టం వాటిల్లడం వంటి సందర్భాల్లో క్లెయిమ్‌లకు ఎలాంటి పరిహారాన్ని భీమా కంపెనీలు చెల్లించవు. నిర్లక్ష్యం లేదా పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆస్తి నష్టం జరిగినట్లు కూడా నిర్ధారణ అయితే వారికి ఎలాంటి పరిహారాలు చెల్లించరు.