ఇసుక తవ్వకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అడ్డుగోలుగా సాగుతును ఇసుక తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలంటూ గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జిటి) జారీ చేసిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.
ఎన్జిటి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ నిషేదం ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్జిటి ఉత్తర్వులపై స్టే ఇవ్వడం కుదరదనిస్పష్టం చేసింది. గత మార్చి 23న ఇసుక తవ్వకాలపై ఎన్జిటి నిషేదం విధించిన సంగతి తెలిసిందే. దీనినిసవాలు చేస్తూ ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అభరు ఎస్ ఓకా, జస్టిస్ సంజరు కరోల్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
ఎన్జిటి తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కాగా రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ఇసుక తవ్వకాలను గంపగుత్తగా జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ పరం చేసిందను ఆరోపణలున్నాయి. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలను చేపడుతున్నారని పలువురు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఏపి ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన ఎన్జిటి, ఇసుక తవ్వాలపై నిషేధం విధించింది. ఈ తీర్పును సమర్ధించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఎన్జీటి తీర్పును యథాతధంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే అడ్డుగోలు ఇసుక తవ్వకాలకు అనుమతించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్జిటి విధించిన రూ.18 కోట్ల జరిమానా విషయంలో సుప్రీంకోర్టు కాస్త ఊరట కల్పించింది. ఈ జరిమానాను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ కేసులో ప్రతివాదులైన నాగేంద్ర కుమార్, హేమ కుమార్‌లకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఇసుక తవ్వకాలపై ఆంక్షలు విధిస్తూ ఎన్జిటి ఇచ్చిన తీర్పులో పలు కీలకాంశాలునాుయి. ప్రధానంగా బి2 కేటగిరీ ఇసుక రీచ్‌లలో పాక్షికంగా యంత్రాలతో ఇసుక త్వవకానికి అనుమతి ఇవ్వడం చట్ట విరుద్ధమనిఎన్జిటి పేర్కొంది.
బి1, బి2 కేటగిరీల కింద ఇసుక తవ్వకాల కోసం ఇప్పటికే ఇచ్చిన అనిు రకాల పర్యావరణ అనుమతులను రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ పున్ణపరిశీలన చేయాలని నిర్దేశించింది. రాష్ట్రంలో ఇసుక రీచ్‌ల పరిధిలో పర్యావరణ విధ్వంసం పరిశీలన, అంచనా కోసం ఒక నిపుణుల కమిటీనికూడా నియమించింది.
ఇసుక తవ్వకాలతో పర్యావరణానికి జరిగిన నష్టానిు గుర్తించాలని ఈ కమిటీ ఆదేశించింది. రివర్ బెడ్లు, నదీ తీరాల్లో భారీ యంత్రాలతో మైనింగ్ చేసుకోవచ్చంటూ అనుమతివ్వడంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది.