మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో మరో మూడు చిరుతలు గాయపడ్డాయి. వాటి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు చిరుతల మెడలో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. చిరుతలకు కాలర్ ఐడీతో వేయడం గాయాలైనట్లుగా తెలుస్తున్నది. ఒబాన్ అనే చిరుత కాలర్ ఐడీని తీయగా లోతైన గాయం కనిపించింది. పురుగులను గుర్తించారు.
ఆ తర్వాత మరో రెండు చిరుతలు ఎల్టన్, ఫ్రెడ్డీ మెడలో నుంచి కాలర్ ఐడీ తొలగించారు. ప్రస్తుతం పది చిరుతల ఆరోగ్యాన్ని వైద్యుల బృందం పర్యవేక్షిస్తున్నది. అదే సమయంలో దక్షిణాఫ్రికా నుంచి నిపుణుల బృందం మంగళవారం కునోకు చేరుకోనున్నది. ఆ తర్వాత అన్ని చిరుతలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు.
అలాగే అగ్ని చిరుత ఒక కాలిలో ఫ్రాక్చర్, వాయు అనే చిరుత ఛాతిలో గాయం ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఇటీవల వరుసగా చిరుతలు మరణించడంతో వాటిన్నింటిని ఎన్క్లోజర్లో ఉంచారు. ఒక నిర్భయ అనే చిరుత మాత్రమే సంచరిస్తున్నది.
గత వారం రోజుల్లో కునోలో రెండు చిరుతలు మృతి చెందాయి. చిరుత సూరజ్ గొంతులో గాయం కారణంగా మృతి చెందింది. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో శుక్రవారం మగ చిరుత సూరజ్ మృతి చెందిన విషయం తెలిసిందే. దర్యాప్తు నివేదికలో సూరజ్ గొంతులో గాయమైందని, ఇందులో గాయంలో పురుగులున్నట్లు తేలింది.
అయితే, చిరుతల మరణానికి రేడియో కాలర్లు కారణమని మీడియాలో వచ్చిన వార్తలను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ తోసిపుచ్చింది. జీపీఎస్ ఆధారిత రేడియో కాలర్లు చిరుతలను ట్రాక్ చేయడానికి మెడకు కట్టినట్లు పేర్కొంది. గత మంగళవారం తేజస్ అనే చిరుత మరణించింది. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా చిరుతల ప్రాజెక్టును చేపట్టింది.
ఇందులో భాగంగా నమీడియా, దక్షిణాఫిక్రా నుంచి చిరుతలను తీసుకువచ్చింది. అయితే, ఇప్పటి వరకు కునే నోషనల్ పార్క్లో ఎనిమిది చిరుతలు మృత్యువాతపడ్డాయి. ఇందులో ఐదు చిరుతలు, మూడు పిల్లలు ఉన్నాయి. ప్రస్తుతం కునో నేషనల్ పార్క్లో 15 చిరుతలు, ఒక చిరుత పిల్ల మిగిలాయి.