వాతావరణాన్ని నియంత్రించే సముద్ర ప్రవాహాలు శతాబ్దపు మధ్య కాలంలో పతనం కావొచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుత గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు ఇప్పటిలానే కొనసాగితే ఈ శతాబ్దపు మధ్యకాలంలోనే సముద్ర ప్రవాహాలు తగ్గే అవకాశం ఉందని కొత్త పరిశోధన అంచనా వేసింది.
ఒకవేళ సముద్ర ప్రవాహాలు తగ్గితే ఐరోపాలో చల్లని వాతావరణం, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో తుఫానులు పెరగడం వంటి తీవ్రమైన పరిణామాలు జరుగుతాయని, భూమి వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తాయని నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన తెలిపింది.
అట్లాంటిక్ మెరిడియోనల్ ఓవర్‌టర్నింగ్ సర్క్యులేషన్ (ఎఎంఓసి) అని పిలువబడే ప్రవాహాలు, ఈ శతాబ్దంలో పతనమవుతాయని, 2057నాటికి మరింత ఎక్కువగా పతనమయ్యే అవకాశముందని తాజా పరిశోధన అంచనా వేసింది. గత 150 సంవత్సరాల నుండి సుముద్ర ఉష్ణోగ్రత డేటాపై అధునాతన గణాంక సాధనాలను ఉపయోగిస్తున్నట్లు డెన్మార్క్‌లోని కోపెన్హాగన్ విశ్వవిద్యాలయం విశ్లేషణ తేటతెల్లంచేసింది.
కాగా, తాజా అధ్యయనం యొక్క సహ సంబంధిత రచయిత పీటర్ డిట్లేవ్సెన్ మాట్లాడుతూ ‘మా తాజా పరిశోధనలో మేము గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా వీలైనంత తర్వగా గ్రౌన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం.. దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం’ అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ శతాబ్దంలో ఎఎంఓసిలో ఆకస్మిక మార్పు చాలా అరుదుగా సంభవించవచ్చనే ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపిసిసి) నివేదికకు ఈ తాజా విశ్లేషణ పూర్తిగా విరుద్ధంగా ఉంది.