ప్రపంచంలోని ఐదు వింతల్లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఉన్న ఐఫిల్ టవర్ ఒకటి. ప్రతి సంవత్సరం వివిధ దేశాల నుంచి లక్షలాదిగా పర్యాటకులు ఐఫిల్ టవర్ ను చూడడానికి పారిస్ వస్తుంటారు. ఐఫిల్ టవర్ ను బాంబులతో పేల్చేస్తామని పారిస్ పోలీసులకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.
దాంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఐఫిల్ టవర్ వద్దకు వెళ్లారు. ఐఫిల్ టవర్ పై వివిధ ఫ్లోర్లలో ఉన్న పర్యాటకులను, ఐఫిల్ టవర్ వెలుపల ఉన్న పర్యాటకులను అక్కడి నుంచి పంపించివేశారు. బాంబ్ స్క్వాడ్ ను రప్పించి, క్షుణ్నంగా ఐఫిల్ టవర్ ను పరిశీలిస్తున్నారు. ఐఫిల్ టవర్ సమీప ప్రాంతాలను కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఐఫిల్ టవర్ లోని ఒక ఫ్లోర్ లో రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్ ను కూడా పోలీసులు మూసేయించారు. ఆ ప్రదేశాన్ని కూడా క్షుణ్నంగా పరీక్షించారు. పర్యాటకులను శనివారం ఐఫిల్ టవర్ వద్దకు అనుమతించలేదు.
ఐఫిల్ టవర్ సౌత్ పిల్లర్ వద్ద పోలీస్ ఔట్ పోస్ట్ ఉంటుంది. ఐఫిల్ టవర్ నిర్మాణం 1887 జనవరిలో ప్రారంభమైంది. రెండేళ్ల పాటు నిర్మాణం కొనసాగింది. చివరకు1889 మార్చిలో పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు చూడాలని కోరుకునే నిర్మాణాల్లో ఐఫిల్ టవర్ ఒకటి.