ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని, గత పదేళ్లలో భారత్ ఎంతో వేగంగా అభివఅద్ధి చెందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ … వరుసగా పదోసారి ప్రధాని మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రసంగిస్తూ గత పదేళ్లుగా భారత్ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోందని చెప్పారు.
శాటిలైట్ రంగంలో మనమే ముందున్నామన్నామని చెబుతూ రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాసిస్తుందని చెప్పారు. 30 ఏళ్ల లోపు యువత భారత్‌కు ఆశాకిరణం అని, వ్యవసాయ రంగంలోనూ దేశం చాలా అభివఅద్ధి చెందిందని ప్రధాని తెలిపారు. డెమోగ్రఫీ, డెమోక్రసీ, బయోడైవర్సిటీ ఈ మూడు భారత్‌కు ఎంతో ముఖ్యమని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
నారీ శక్తి, యువశక్తి భారత్‌కు బలం అని, భారత్‌లో యువశక్తి ఎంతో అద్భుతంగా ఉందని చెప్పారు. టెక్నాలజీ విషయంలో భారత్ ఎంతో మెరుగుపడిందని, డిజిటల్ ఇండియా దిశగా భారత్ దూసుకెళుతోందని తెలిపారు.
కొత్త ప్రపంచంలో భారత్‌ను విస్మరించడం ఎవరి తరమూ కాదని ప్రధాని స్పష్టం చేశారు. కాగా, మధ్యతరగతి సొంతింటి కల సాకారానికి కొత్త పథకం తీసుకురాబోతున్నామని, బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చే కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నామని ప్రధాని వెల్లడించారు. పట్టణ ప్రాంతాల దిగువ, మధ్యతరగతి సొంతింటి కల సాకారమే లక్ష్యంగా పథకాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. రూ.లక్షల్లో ప్రయోజనం కల్పించే ఈ పథకం త్వరలో ప్రకటిస్తాంమని ప్రధాని చెప్పారు.
దేశం మణిపూర్ ప్రజలకు అండగా ఉందని ప్రధాని భరోసా ఇచ్చారు. మణిపూర్‌లో శాంతిస్థాపనకు కఅషి చేస్తున్నామన్నామని చెబుతూ మణిపూర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని తెలిపారు. మరో వెయ్యేళ్లు భారత్ వెలుగుతూనే ఉంటుందని ప్రధాని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలం అని తెలిపారు.
ప్రతి నిర్ణయంలోనూ దేశానికే మొదటి ప్రాధాన్యత అని, దేశంలో సుస్థిరమైన, శక్తివంతమైన ప్రభుత్వం ఉందని చెప్పారు. గత పదేళ్లలో ఎన్నో కీలక సంస్కరణలు తీసుకొచ్చామని చెబుతూ అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళుతోందని, ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ అభివఅద్ధి చెందుతోందని ప్రధాని స్పష్టం చేశారు.
క్రీడా రంగంలో యువత సత్తా చాటుతోందని హర్షాన్ని వ్యక్తం చేశారు. స్టార్టప్స్ రంగంలో టాప్-3లో భారత్ ఉందని చెప్పారు. జీ-20 నిర్వహించే అరుదైన అవకాశం భారత్‌కు లభించిందని పేర్కొంటూ కరోనా మనకు ఎన్నో పాఠాలను నేర్పిందని, కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారిందని తెలిపారు.
కరోనా సమయంలో ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లామని, ప్రపంచాన్ని మార్చడంలో భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తున్నామని హామీ ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటే దేశం బాగుంటుందని చెప్పారు.
రూ.4 లక్షల కోట్లతో పేదలకు ఇళ్లు నిర్మించామని, . 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని వివరించారు. అవినీతి రాక్షసి దేశాన్ని వెనక్కి తీసుకెళ్లిందని, ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రధాని స్పష్టం చేశారు. సుస్థిర ప్రభుత్వంతో అభివఅద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. ” దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉంది, దేశాన్ని ముందుకు నడిపిస్తోంది ” అని ప్రధాని మోదీ చెప్పారు.