వాయువ్య పాకిస్తాన్లోని 100 ఏళ్ల నాటి పునర్నిర్మించిన మహారాజా పరమహంస్ జీ మందిర్లో శనివారం గట్టి భద్రత మధ్య సుమారు 200 మందికి పైగా హిందూ యాత్రికులు ప్రార్థనలు చేశారు. రాడికల్ ఇస్లామిస్ట్కు చెందిన గుంపు కూల్చివేసిన ఈ ఆలయంలో ఒక సంవత్సరం తర్వాత ప్రార్ధనలు చేసుకోగలిగారు.
హిందూ యాత్రికులతో భారత్ నుండి వచ్చిన వారితో పాటు అమెరికా,గల్ఫ్ దేశాల నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కరక్ జిల్లా, తేరి గ్రామంలోని పరమహంస్ జీ మందిరం, ‘సమాధి’ని 2020లో కూల్చివేసిన సంఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఖండనలకు గురయింది.
భారతీయ యాత్రికులు లాహోర్ సమీపంలోని వాఘా సరిహద్దు గుండా ఇక్కడకు చేరుకోగా, వారు సాయుధ సిబ్బంది సహకారంతోతో ఆలయానికి వెళ్లగలిగారు. జాతీయ క్యారియర్ పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ సహకారంతో పాకిస్థానీ హిందూ కౌన్సిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమంకు మొత్తం తేరి గ్రామంతో పాటు సుమారు 600 మంది రేంజర్లు, ఇంటెలిజెన్స్, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఫోర్స్ కీపింగ్ గార్డులు పోలీసు సూపరింటెండెంట్ ర్యాంక్ అధికారి నేతృత్వంలో అండగా నిలిచారు. ఈ సందర్భంగా పూజలు శనివారం రాత్రి అంతా జరగడంతో పాటు, ఆదివారం మధ్యాహ్నం వరకు కొనసాగాయి.
‘హుజ్రాస్’ లేదా ఓపెన్ ఎయిర్ రిసెప్షన్ గదులను యాత్రికుల కోసం షెల్టర్లుగా మార్చారు. ఆలయ సమీపంలోని మార్కెట్లు పర్యాటకులతో కిటకిటలాడాయి. హిందూ బృందానికి చెందిన పిల్లలు స్థానిక పిల్లలతో క్రికెట్ ఆడుతున్న ఫోటోలు ఆకర్షణీయంగా నిలిచాయి.
హిందూ కమ్యూనిటీ న్యాయ వ్యవహారాల ఇన్ఛార్జ్ రోహిత్ కుమార్ ఏర్పాట్లు, మరమ్మత్తు పనులు చేపట్టిన పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అభినందించారు. “ఈ ప్రాంతంలో శాంతి, మత సామరస్యాన్ని పెంపొందించడానికి భారతదేశానికి చెందిన యాత్రికులు ఈ రోజు మందిర్లో ప్రార్థనలు జరుపుకో గలగడం భారతదేశానికి సానుకూల సందేశం” అని ఆయన పేర్కొన్నారు.
పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ “విశ్వాస పర్యాటకం” ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ప్రచారం కలిగించారు. మహారాజ్ పరమహంస్ జీ 1919లో తేరి గ్రామంలో మరణించారు.
రాడికల్ జమియాత్ ఉలేమా-ఇ-ఇస్లాం-ఫజల్ ( జేయుఐ- ఎఫ్)కి చెందిన కొందరు సభ్యులు డిసెంబర్ 30, 2020న ‘సమాధి’ని ధ్వంసం చేశారు. 1997లో ఆలయంను కూడా కూల్చివేశారు. జేయుఐ- ఎఫ్ మాబ్ నుండి రూ. 3.3 కోట్లను స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రాంతీయ ప్రభుత్వం దానిని పునరుద్ధరించింది.