తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవలే సనాతన ధర్మంపై పరుష వ్యాఖ్యలు చేయడంపై మంత్రులు తీవ్రంగా స్పందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతవారం మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేసిన తర్వాత ఒక్కరొక్కరుగా కేంద్ర మంత్రులు కన్నెర్ర చేస్తున్నారు.
సనాతన ధర్మంపై పిచ్చి కూతలు కూసే వారికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. రాజస్థాన్ లోని బర్మర్ లో ఎన్నికల ర్యాలీలో భాగంగా ఈ అంశంపై కేంద్ర మంత్రి షెకావత్ కఠినంగా స్పందిస్తూ ‘‘మన పూర్వీకులు వారి జీవితాలను పణంగా పెట్టి కాపాడిన సనాతన ధర్మాన్ని కొందరు వ్యక్తులు నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిని ఇక ఎంత మాత్రం ఉపేక్షించబోము” అని హెచ్చరించారు.
“సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి నాలుకలను పీకేస్తాం. దీని పట్ల అలక్ష్యంగా చూస్తే వారి కళ్లను పీకేస్తాం. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, వారి రాజకీయ శక్తిని చాటలేరు’’ అని గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు.
మరోవైపు బీజేపీ ఎంపీ సాధ్వి ప్రాగ్య సైతం దీనిపై స్పందించారు. సనాతన ధర్మాన్ని అంతం చేసే శక్తి ఎవరికీ లేదన్నారు. డీఎంకే నేత ఉదయనిధి, నటుడు ప్రకాష్ రాజ్ సనాతన ధర్మంపై అలాంటి ప్రకటనలు చేస్తే, వారు హీరోలు కాబోరని, ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే విలన్లు అవుతారని వ్యాఖ్యానించారు. మనం ఏం చేస్తున్నామనేది కూడా వారికి తెలియదని చెప్పారు.
కాగా, భారతీయుల విశ్వాసపాత్రమైన సనాతన ధర్మాన్ని కొందరు పనిగట్టుకుని కించపరుస్తున్నారని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. ఇంతజరుగుతోన్నా ఇంతవరకూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కానీ, శివసేన నాయకులు ఉద్ధవ్ థాకరే కానీ దీనిపై మౌనం వహించారని తెలిపారు.
విదేశీ పర్యటనకు వెళ్లిన రాహుల్ పలు విషయాలపై పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. హిందూ , హిందూ ధర్మం , ఉపనిషిత్తులలో వీటి గురించి చెప్పడం కాదు, సనాతన ధర్మం పట్ల అవమానకర వ్యాఖ్యలపై రాహుల్ ఏమంటారని ప్రశ్నించారు. ప్రతిపక్షం ముందు దీనిపై తమ మౌనం వీడాలని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష నేతలు పనిగట్టుకుని సనాతన ధర్మం గురించి అవహేళనకు దిగుతున్నారని, ఇదే వారి తంతుగా మారిందని కేంద్ర మంత్రి తెలిపారు. విపక్ష నేతలు ఒకరి తరువాత ఒకరుగా దుష్ప్రచారానికి దిగడం ఆనవాయితీ అయిందని మండిపడ్డారు.
దేశంలో ఇప్పుడు ఇండియా వర్సెస్ భారత్ వివాదం రగులుకుందని లండన్, పారిస్‌లలో రాహుల్ గాంధీ మాట్లాడటం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. కొందరు పనిగట్టుకుని కొన్నివిషయాలపై భయాందోళనలు , గందరగోళం సృష్టించాలనే ఆలోచన ఉంటుందని , వీరు జీవితాంతం ఇదే పనిలో ఉంటారు. భ్రమలు కల్పిస్తారని చెప్పారు.
భారతీయుల విశ్వాసపాత్రమైన సనాతన ధర్మాన్ని కొందరు పనిగట్టుకుని కించపరుస్తున్నారని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. ఇంతజరుగుతోన్నా ఇంతవరకూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కానీ, శివసేన నాయకులు ఉద్ధవ్ థాకరే కానీ దీనిపై మౌనం వహించారని తెలిపారు. విదేశీపర్యటనకు వెళ్లిన రాహుల్ పలు విషయాలపై పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
హిందూ , హిందూ ధర్మం , ఉపనిషిత్తులలో వీటి గురించి చెప్పడం కాదు, సనాతన ధర్మం పట్ల అవమానకర వ్యాఖ్యలపై రాహుల్ ఏమంటారని ప్రశ్నించారు. ప్రతిపక్షం ముందు దీనిపై తమ మౌనం వీడాలని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలు పనిగట్టుకుని సనాతన ధర్మం గురించి అవహేళనకు దిగుతున్నారని, ఇదే వారి తంతుగా మారిందని కేంద్ర మంత్రి తెలిపారు.
విపక్ష నేతలు ఒకరి తరువాత ఒకరుగా దుష్ప్రచారానికి దిగడం ఆనవాయితీ అయిందన్నారు. దేశంలో ఇప్పుడు ఇండియా వర్సెస్ భారత్ వివాదం రగులుకుందని లండన్, పారిస్‌లలో రాహుల్ గాంధీ మాట్లాడటం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. కొందరు పనిగట్టుకుని కొన్నివిషయాలపై భయాందోళనలు , గందరగోళం సృష్టించాలనే ఆలోచన ఉంటుందని , వీరు జీవితాంతం ఇదే పనిలో ఉంటారు. భ్రమలు కల్పిస్తారని చెప్పారు.