ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ల హహ కొనసాగింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత బ్యాటింగ్ విభాగం నుంచి ముగ్గురు ఆటగాళ్లు టాప్-10లో చోటు సాధించారు. ఆసియాకప్‌లో అద్భుత ప్రదర్శనలు చేస్తూ టీమిండియాకు వరుసగా రెండో విజయాన్ని అందించిన భారత ఆటగాళ్లు ఇప్పుడు ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లోనూ అదే జోరు కనబర్చారు.
టీమిండియా తరఫున శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మలు తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. దాంతో నాలుగుళ్ల తర్వాత ముగ్గురు భారత ఆటగాళ్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ కెరీర్ అత్యుత్తమ 2వ ర్యాంకును అందుకోగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు రెండు, రెండు స్థానాలు మెరుగుపర్చుకొని వరుసగా 8, 9 ర్యాంకుల్లో నిలిచారు.
చివరిసారిగా 2018లో టీమిండియా తరఫున శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టాప్-10లో నిలిచారు. ఇప్పుడు తాజాగా 2023లో గిల్, కోహ్లీ, రోహిత్‌లు మరోసారి ఆ ఫీట్‌ను అందుకున్నారు. ప్రస్తుతం శ్రీలంక వేదికగా జరుగుతున్న ఆసియాకప్‌లో దూకుడుగా ఆడుతున్న శుభ్‌మాన్ గిల్ నేపాల్‌పై (67 నాటౌట్), పాకిస్తాన్‌పై (58), శ్రీలంకపై (19) పరుగులు చేశాడు.
మొత్తంగా రెండు హాఫ్ సెంచరీల సహాయంతో 154 పరుగులు చేశాడు. దీంతో ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో (759 రేటింగ్ పాయింట్ల)తో ఒక్క స్థానం మెరుగుపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు. మరోవైపు ఆసియాకప్ సూపర్-4లో పాకిస్తాన్‌పై అజేయ శతకంతో చెలరేగిన విరాట్ కోహ్లీ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని (715)తో పది నుంచి 8వ ర్యాంక్‌కు చేరాడు. అలాగే ఆసియాకప్‌లో వరుసగా మూడు అర్ధ శతకాలు నమోదు చేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రెండు స్థానాలు ఎగబాకి (707)తో 9వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు.
పునరాగమనంలో సెంచరీతో చెలరేగిన కేఎల్ రాహుల్ పది స్థానాలు ఎగబాకి 37వ, ఇషాన్ కిషన్ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని 22వ ర్యాంక్‌ను అందుకున్నారు. ఇక వన్డేల్లో పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మన్, కెప్టెన్ బాబర్ ఆజమ్ (863) రేటింగ్ పాయింట్లతో తన అగ్ర స్థానాన్ని కాపాడుకున్నాడు.
దక్షిణాఫ్రికా బ్యాటర్ వాన్‌డర్ డూసెన్ (745) ఒక్క స్థానం దిగజారి 3కు చేరుకోగా సౌతాఫ్రికా సిరీస్‌లో అదరగొడుతున్న ఆసీస్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ 4వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. పాకిస్తాన్ జట్టు నుంచి ఇమామ్ ఉల్ హక్ (5వ), ఫకర్ జమాన్ (10వ) టాప్-10లో చోటు దక్కించుకున్నారు.
ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ స్పిన్నర్ కుల్దిప్ యాదవ్ ఒక్క స్థానం మెరుగుపరుచుకొని 7వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఆసియాకప్‌లో విజృంభించి బౌలింగ్ చేసిన మణికట్టు స్పిన్నర్ కుల్దిప్ పాకిస్తాన్‌పై పాకిస్తాన్‌పై 5, శ్రీలంకపై 4 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా తరఫున మహ్మద్ సిరాజ్ తన 9వ ర్యాంకును పదిలంగా ఉంచుకున్నాడు.
ఈ విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ జోష్ హాజిల్‌వుడ్ తన నెం.1 స్థానంలో కొనసాగుతున్నాడు. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) రెండో ర్యాంక్‌లో నిలవగా.. కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఒక్క స్థానం ఎగబాకి 3వ ర్యాంకును అందుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో టీమిండియా నుంచి హార్దిక్ పాండ్య ఒక్క స్థానం మెరుగుపరుచుకొని 6వ స్థానంలో నిలిచాడు. టీమ్‌ల విషయానికొస్తే ప్రస్తుతం నెం.1 స్థానం కోసం మూడు జట్ల మధ్య గట్టిపోటీ నడుస్తోంది.
ఇటీవల పాకిస్తాన్‌ను వెనక్కి నెట్టి ఆస్ట్రేలియా (118 పాయింట్ల)తో తిరిగి టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకోగా పాకిస్తాన్ కూడా 118 పాయింట్లతో రెండో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు వరుసగా రెండు విజయాలు సాధించిన టీమిండియా కూడా 116 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. కేవలం 2 పాయింట్ల వ్యత్యాసం ఉండటంతో ఆసియా కప్ ముగిసేసమయానికి భారత్ మళ్లి అగ్ర స్థానాన్ని సొంతం చేసుకొనే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.