వన్డే ప్రపంచకప్‌లో భారత్ బోణీ కొట్టింది. విరాట్ కోహ్లీ 85 (116 బంతుల్లో 6×6), కెఎల్ రాహుల్ 97 (115 బంతుల్లో 2×8, 6×2) బాధ్యాతాయుతమైన ఇన్నింగ్స్‌లో భారత్‌ను గట్టెక్కించారు. తక్కువ లక్ష ఛేదనలో తడబడినా 9 ఓవర్లు మిగిలుండగానే విజయానందుకొని శుభారంభం చేసింది.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత భారత బౌలర్లు అదరగొట్టడంతో ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలింది. ఈ స్వల్ప టార్గెట్‌ను 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
రోహిత్ శర్మ (0), ఇషాన్ కిషన్ (0), శ్రేయస్ అయ్యర్ (0) వరుసగా పెవిలియన్ బాటపట్టడంతో రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్. ఇక మూడు వికెట్లు కోల్పోయినా కోహ్లీ, రాహుల్ చాలా బాధ్యతాగా సింగిల్స్ తీస్తూ, అడపాదడపా బౌండరీలకు తరలిస్తూ 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 3, మిచెల్ స్టార్క్ ఒక వికెట్ పడగొట్టారు.
భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు దుమ్మురేపారు. రవీంద్ర జడేజా(3/28) తీన్మార్ బౌలింగ్‌కు కుల్దీప్ యాదవ్(2/42), జస్ప్రీత్ బుమ్రా(2/35)లు చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకే చాపచుట్టేసింది.
ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ 46 (71 బంతుల్లో 5×4), డేవిడ్ వార్నర్ 41 (52 బంతుల్లో 6×4) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో మిచెల్ స్టార్క్ 28 (35 బంతుల్లో 2×4, 6×1) పరుగులు చేయడంతో ఆసీస్ ఆమాత్రం స్కోరు చేయగలిగింది. ఇక భారత బౌలింగ్ సమష్టిగా రాణించడంతో కంగారులను తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగారు. ఛేదనలో టీమ్ ఇండియాకు ఆసీస్ పేసర్లు గట్టి షాక్ ఇచ్చారు.
లక్ష్యం చిన్నదే అయినా.. 2 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకోవటంతో ఆతిథ్య జట్టు విజయావకాశాలు అమాంతం పడిపోయాయి. జోశ్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ నిప్పులు చెరగటంతో రోహిత్ శర్మ (0), ఇషాన్ కిషన్ (0), శ్రేయస్ అయ్యర్ (0) ఇన్నింగ్స్ తొలి 12 బంతులకే పెవిలియన్ బాట పట్టారు.
ఈ సమయంలో విరాట్ కోహ్లి (85), కెఎల్ రాహుల్ (97 నాటౌట్) అద్భుత ఆటతీరు చూపించారు. ఛేదనలో మొనగాడు కోహ్లికి రాహుల్ చక్కటి సహకారం అందించాడు. కోహ్లి 12 పరుగుల వద్ద ఓ జీవన దానం పొందాడు. అవకాశం చక్కగా సద్వినియోగం చేసుకున్న కోహ్ల మూడో వికెట్‌కు రాహుల్‌తో కలిసి గెలుపు భాగస్వామ్యం నిర్మించాడు.
కోహ్లి మూడు ఫోర్లతో 75 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా, రాహుల్ ఐదు ఫోర్లతో 72 బంతుల్లో అర్థ శతకం కొట్టాడు. అర్థ సెంచరీల అనంతరం ఇద్దరూ గేర్ మార్చారు. చివర్లో కోహ్లి అవుటైనా.. హార్దిక్ పాండ్య (11 నాటౌట్) తోడుగా రాహుల్ లాంఛనం ముగించాడు. 41.2 ఓవర్లలోనే భారత్ 201 పరుగులు చేసి ప్రపంచకప్‌లో తొలి విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ (3/38) మూడు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు.