రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తితో వివిధ సామజిక క్షేత్రాలలో పనిచేస్తున్న సంస్థల ముఖ్య కార్యకర్తలతో మూడు రోజులపాటు జరిగే ఆర్ ఎస్ ఎస్ జాతీయ స్థాయ సమన్వయ సమావేశం బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమైనది. సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హాసభలే తో పాటు ఆ సంస్థకు చెందిన మొత్తం ఐదుగురు సహా సర్ కార్యవహ్ లు, ఇతర ముఖ్యమైన కార్యనిర్వాహకులు పాల్గొన్నారు.
వివిధ సామజిక క్షేత్రాలలో పనిచేస్తున్న 36 సంస్థలకు చెందిన 216 మంది ముఖ్య కార్యనిర్వాహకులు సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశాలలో ఎటువంటి విధాన నిర్ణయాలు తీసుకోమని, కేవలం పరస్పరం సమాచారాన్ని, అభిప్రాయాలను పంచుకోవడం మాత్రమే చేస్తామని సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు.
సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ సమావేశాలు గత ఏడాది గుజరాత్ లోని కర్ణావతిలో జరిగాయి. ఆ సమావేశాలలో ఆర్ధిక, ఉపాధి సంబంధ అంశాలపై సమాలోచనలు జరుగగా, ఈ పర్యాయం విద్యాసంబంధ అంశాలపై చర్చలు జరుగుతాయని ఆయన చెప్పారు.
గత పర్యాయం ఆర్ధిక సంబంధ రంగాలలో పనిచేస్తున్న భారతీయ మజ్దూర్ సంఘ్, స్వదేశీ జాగరణ్ మంచ్, లఘు ఉద్యోగ్ భారతి తదితర సంస్థలు తమ ఆలోచనలు పంచుకోగా, ఈ సారి విద్యారంగంలో పనిచేస్తున్న విద్యా భారతి, ఎబివిపి, భారతీయ శిక్ష్ మండల్ వంటి సంస్థలు తమ అనుభవాలని అందజేస్తారునై వివరించారు.
చివరిరోజున, జనవరి 7 మధ్యాహ్నం జరిగే మీడియా సమావేశంలో సహా సర్ కార్యవాహ మన్మోహన్ వైద్య సమావేశం వివరాలను తెలుపుతారు. సమావేశాలలో చర్చించి ఇతర విషయాలను ప్రస్తావిస్తూ కరోనా సమయంలో తాము చేపట్టిన కార్యక్రమాలు, పిల్లలలో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, పోషకాహార లోపాన్ని నిర్మూలించడానికి అమలు పరచిన వివిధ కార్యక్రమాల గురించి సేవాభారతి వివరిస్తుందని అంబేకర్ వివరించారు.
కాగా, మరో నాలుగేళ్లలో ఆర్ ఎస్ ఎస్ ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. సంఘ్ చేబడుతున్న పరివారణం (పర్యావరణ), పరివార్ ప్రబోధన్ (కుటుంబ అవగాహన), సామాజిక సమరస్తా (సామాజిక సామరస్యం) కార్యక్రమాలపై సమావేశంలో చర్చలు జరగనున్నాయి. 75వ స్వాతంత్య్ర వేడుకల్లో అన్ని సంస్థలు పాల్గొంటున్నాయి. వారు నిర్వహించిన కార్యక్రమాలు, ప్రత్యేక అంశాల గురించి కూడా చర్చలు జరుపనున్నారు.