నైపుణ్య శక్తుల కోసం భారత్ వైపు ప్రపంచం చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. వేగంగా మారుతున్న పరిస్థితులు, ఉద్యోగ ధోరణులకు అనుగుణంగా యువత స్పందించాలని, నైపుణ్యాలను నిరంతరం సాధన చేయడం, వాటిని మెరుగుపరుచుకోవడం, అవసరమైన మార్పులతో తిరిగి సాధన చేయాలని కోరారు.
నైపుణ్యాభివృద్ధి నుంచి యువత, దేశ ఆర్థిక వ్యవస్థ గరిష్ఠ ప్రయోజనం పొందాలని మోదీ ఆకాంక్షించారు. గురువారం ఢిల్లీలో జరిగిన ‘కౌశల్ దీక్షాంత్ సమారో్‌హ’లోనూ, ఉత్తరాఖండ్‌లో జరిగిన సభలోనూ ఆయన యువతను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రతి దేశం భిన్న వనరులను కలిగి ఉంది. అయితే, యువశక్తిని వినియోగించుకోవడం ఏ దేశానికైనా ప్రధానమే. యువతరాన్ని మనం ఎంత శక్తిమంతం చేస్తే దేశం అంత సౌభాగ్యవంతమవుతుంద” అని చెప్పారు.
నైపుణ్యాలు, విద్య ద్వారా కొత్త అవకాశాలను ఉపయోగించుకుని ప్రయోజనం పొందేవిధంగా దేశయువతను తర్ఫీదు చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. రక్షణ, తయారీ రంగాలతోపాటు అంతరిక్షం, అంకుర సంస్థలు, డ్రోన్లు, విద్యుత్ వాహనాలు, సెమీకండక్టర్లు తదితర రంగాల్లో కొత్త అవకాశాలు యువత కోసం ఎదురు చూస్తున్నాయని చెప్పారు.
‘‘ఈ శకం మనది కాబోతోంది. యువజనాభాకే ఈ ఘనత దక్కుతుంది. చాలా దేశాలు వృద్ధ జనాభాతో కుంగిపోతుంటే, యువభారత్ మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో నైపుణ్యం కలిగిన యువత కోసం భారత్ వైపు ప్రపంచం చూసే పరిస్థితి ఇప్పుడు ఉంది’’ అని మోదీ తెలిపారు. గత ఆరేళ్లతో పోల్చితే నిరుద్యోగ శాతం బాగా తగ్గిపోయిందని మోదీ చెప్పారు.
ఉద్యోగ కల్పనా శాతం అత్యున్నత స్థాయికి చేరుకోవడంతోపాటు పట్టణాలతో సమానంగా గ్రామాల్లోనూ యువతకు అవకాశాలు వృద్ధి కావడమే దీనికి కారణమని ప్రధాని వివరించారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా ఇప్పటివరకు 1.5 కోట్లమంది యువతను పలు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలతో తర్ఫీదు చేసినట్టు తెలిపారు.
డ్రోన్ సాంకేతికత వంటి నైపుణ్య సంబంధిత కార్యక్రమాల్లో మహిళలను సమ్మిళితం చేసేలా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అమలుపరచాలని ప్రధాని కోరారు. సమస్యలు చుట్టుముట్టిన ప్రపంచంలో భారత్ మాటకు విలువ అంతకంతకు పెరుగుతోందని మోదీ తెలిపారు.
30, 40 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉండిపోయిన మహిళా రిజర్వేషన్లు వంటి అంశాల్లో నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళుతున్నామని, చంద్రయాన్-3ని విజయవంతం చేయగలిగామని ఆయన తెలిపారు. ఢిల్లీలో జరిగిన జీ-20 సదస్సు భారత్ శక్తి ఏమిటనేది ప్రపంచానికి చాటిందని చెప్పారు.
ఆది కైలా్‌సకు అభిముఖంగా మోదీ ధ్యానముద్ర
ఉత్తరాఖండ్‌లోని పిథౌరాగఢ్‌లో గౌరికుండ్ ఆలయంలో గురువారం మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదికైలా్సకు ప్రణమిల్లారు. సరిహద్దు రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో రోజంతా గడిపిన ఆయన ఆ విశేషాలను ట్విటర్ (ఎక్స్) ద్వారా పంచుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించిన మోదీ.. ఆది కైలాస్ శిఖరం కనిపిస్తున్న వైపు ప్రణమిల్లారు. అభిముఖంగా నిలబడి ధ్యానముద్ర దాల్చారు.
పవిత్ర జల తీరంలోని పార్వతి కుండ్ ఆలయాన్ని దర్శించుకోవడంతోపాటుగా శివ పార్వతులు కొలువైన దేవాలయంలో హారతి పట్టారు. అక్కడనుంచి గుంజీ గ్రామం చేరుకుని స్థానికులతో సంతోషంగా గడిపారు. దేశీ వస్తువులతో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను మోదీ సందర్శించారు. అక్కడనుంచి జగేశ్వర్ ధామ్ చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. పిథౌరాగఢ్‌లో రూ. 4200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.