రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లుగా నియమిస్తూ బుధవారం భారత రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘబస్ దాస్‌ను ఒడిశా గవర్నర్లుగా నియమించింది.
ఇంద్రాసేనా రెడ్డి తొలుత విద్యార్ధి నాయకుడిగా ఎబివిపిలో, తర్వాత జనతా పార్టీలో, బీజేపీలో మొదటి నుండి పనిచేస్తూ ఐదు శతాబ్దాలుగా ప్రజా జీవనంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మూడు పర్యాయాలు మల క్‌పేట ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన, నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పలుమార్లు పోటీ చేశారు.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ అధ్యక్షునిగా పని చేశారు. పార్టీ శాసనసభా పక్ష నేతగా కూడా వ్యవహరించారు. బీజేపీ యువమోర్చ తొలి రాష్త్ర అధ్యక్షునిగా, జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. బిజెపి జాతీయ కార్యదర్శిగా పనిచేసిన ఆయన సుదీర్ఘకాలంగా జాతీయ కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రాంతానికి చెందిన ఇంద్రసేనా రెడ్డి ఆర్ఎస్ఎస్లో కీలకంగా పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నేతగా నక్సలైట్ వ్యతిరేక పోరాటాలలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయి జైలులో గడిపారు.
ఆయన 1983, 1985, 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మలక్‌పేట్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 1996, 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ లోకసభ నియోజకవర్గం నుంచి, 2009లో మల్కాజ్గిరి లోకసభ నియోజకవర్గం నుంచి 2014లో భువనగిరి లోకసభ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
కాగా, ఇప్పటికే తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు గవర్నర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. సీహెచ్ విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. ప్రస్తుతం హర్యానా గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ పనిచేస్తున్నారు. తాజాగా, ఇంద్రసేనా రెడ్డి గవర్నర్‌గా నియామకం కావడం గమనార్హం. ఏపీ బీజేపీకి చెందిన కంభంపాటి హరిబాబు ఇటీవల మిజోరాం గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే.