వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ విజయదశమి ఉత్సవంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ విచ్చేశారు.
‘మనం వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలి. ప్రపంచం నుంచి మన దేశానికి సరిపోయేవే తీసుకోవాలి. కాలానికి తగినట్లు దేశ ఉత్పత్తులు రూపొందించుకోవాలి. స్వదేశీ అభివృద్ధి మార్గాన్ని అవలంబించాల్సి ఉంది. సమాజ ఐక్యత మంత్రంతో అభివృద్ధికి సమాధానం దొరకాలి. ఐక్యత సాధించడం రాజ్యాంగంలో మార్గదర్శక సూత్రం’ అని డా. మోహన్ భగవత్ చెప్పుకొచ్చారు.
మణిపూర్ హింసాకాండకు బయటి శక్తులే కారణమని ఆరోపించారు. మణిపూర్ హింసను కొందరు ప్రేరేపించారని, ఈశాన్య రాష్ట్రం భగ్గుమనేందుకు వారే కారణమని స్పష్టం చేశారు. చాలా కాలంగా అక్కడ మైతీలు, కుకీలు కలిసిమెలసి బతుకుతున్నారని, వారి మధ్య చిచ్చు పెట్టి అంతర్యుద్ధంలో ఎవరు ప్రయోజనాలు పొందుతున్నారని ప్రశ్నించారు. అక్కడ జరిగిన విషయంలో బయటి శక్తులు ఉన్నాయని, హింసాకాండను రేపి అవి చలి కాచుకుంటున్నాయని తెలిపారు.
ఇక మణిపూర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడురోజు పాటు మకాం వేశారని, ఈ ఘర్షణలను కొందరు ప్రేరేపించారని, అసలు ఇది జరిగింది కాదని, పనిగట్టుకుని కొందరు హింస చెలరేగేలా వ్యవహరించారని మోహన్ భగవత్ ఆరోపించారు. శాంతి నెలకొంటుందనుకున్న సమయంలో కొన్ని ఘటనలు మళ్లీ జరిగాయని, ఇది ఇరు వర్గాల మధ్య దూరం పెంచాయని పేర్కొన్నారు.
కాగా, మణిపూర్ లో ప్రశాంత పరిస్థితి పునరుద్దరణకు “రాజకీయ సంకల్పం” అవసరమని డా. భగవత్ స్పష్టం చేశారు. ఈ దిశలో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటున్నా ప్రశాంతత ఏర్పడినట్లు కనిపించగానే మరేదో ఘటన వెలుగులోకి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
మార్క్సిస్ట్ మేధావులు మీడియా, బోధనా రంగంలో తమ పట్టును ఉపయోగించుకుని దేశ విద్యా వ్యవస్ధను, సంస్కృతిని, సమాజ ఐక్యతను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. విదేశాలలో, దేశంలోని కొంతమందికి భారతదేశం ముందుకు సాగడం ఇష్టం లేదని డా. భగవత్ చెప్పారు.
”సమాజంలోని ఒక వర్గానికి వ్యతిరేకంగా వారు ఆడుతున్నారు. భారతదేశం పురోగమించినప్పుడు, వారు స్వయంచాలకంగా నియంత్రణలోకి వస్తారు. వారు ఏ నిజమైన వ్యక్తినైనా ఇష్టపడరు – అది సంఘ్ వ్యక్తి లేదా కమ్యూనిస్ట్ కావచ్చు. వారు సాంస్కృతిక మార్క్సిస్టులు లేదా మేల్కొనేవారు. మార్క్స్ చెప్పినది జరగదని వారికి తెలుసు, కానీ దానిని సామరస్యాన్ని వ్యతిరేకించడానికి ఉపయోగిస్తారు” అని తెలిపారు.
“భారత్ ఎదుగుదల ఉద్దేశ్యం ఎప్పుడూ ప్రపంచ సంక్షేమమే. కానీ, స్వార్థపూరిత, వివక్షత, మోసపూరిత శక్తులు, తమ మతపరమైన ప్రయోజనాలను కోరుకునే శక్తులు కూడా సామాజిక ఐక్యతకు విఘాతం కలిగించడానికి, సంఘర్షణలను ప్రోత్సహించడానికి తమ స్వంత ప్రయత్నాలు చేస్తున్నాయి” అంటూ హెచ్చరించారు.
వారు రకరకాల దుస్తులు ధరిస్తారు. వీటిలో కొన్ని విధ్వంసకరం శక్తులు తమను తాము సాంస్కృతిక మార్క్సిస్టులు లేదా “మేల్కొల్పె” వారం అని పిలిపించుకుంటాయని తెలిపారు. మాతృభూమి పట్ల భక్తి, పూర్వీకుల పట్ల గుర్వించడం, ఉమ్మడి సంస్కృతి. “బయటి నుండి వచ్చిన” విశ్వాసాలు కూడా ఈ అంశాలకు కట్టుబడి ఉండాలని డా. భగవత్ సూచించారు.
జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని చెబుతూ ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శంకర్ మహదేవన్ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం చాలా గౌరవంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్, ఆర్ఎస్ఎస్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.