తెలంగాణాలో బిజెపి అధికారంలోకి వస్తే బిసి వర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రి చేస్తామని బిజెపి అగ్రనేత , హోమంత్రి అమిత్ షా ప్రకటించారు..ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించిన బిజెపి జన గర్జన సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తూ కాంగ్రెస్, బిఆర్ఎస్ లు బిసిలకు చేసిందేమి లేదంటూ విమర్శించారు.
వారసులను కూర్చోబెట్టడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల లక్ష్యమని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ బీసీల సంక్షేమం ఎందుకు ఒదిలేసిందని ప్రశ్నించారు. తెలంగాణకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏమి చేయలేదని చెబుతూ కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారని తెలిపారు. బీజేపీ మాత్రమే పేదల సంక్షేమం కోసం ఆలోచిస్తోందని చెప్పారు.
కేసీఆర్ ఈ సారి అధికారంలో వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారా? అని ప్రశ్నించారు. పేదల వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్. దళితలు, బీసీలకు అన్యాయం చేసిన పార్టీ బీఆర్ఎస్. దళిత ముఖ్యమంత్రి హామీని మర్చిన వ్యక్తి కేసీఆర్ అని దుయ్యబట్టారు.
సోనియా, రాహుల్, కేసీఆర్‌లకు ముందుగా వాళ్ల కుటుంబమే ముఖ్యమని తెలిపారు. రాహుల్‌ను ప్రధాని చేయడమే సోనియా లక్ష్యమని చెప్పారు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఏమైందో చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు. రూ. 50 వేల కోట్లతో దళితులు నిధి ఏమైందో కేసీఆర్ చెప్పాలని అమిత్ షా నిలదీశారు. రూ. 10 వేల బీసీ సంక్షేమ నిధులు ఏం చేశారో చెప్పాలని కోరారు.
”కేటీఆర్‌ను సీఎంను చేయాలని కేసీఆర్ ఆలోచిస్తుంటారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని సోనియాగాంధీ చూస్తుంటారు. కేసీఆర్, సోనియాకు వాళ్ల కుటుంబం మాత్రమే ముఖ్యం. వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే భారాస, కాంగ్రెస్ లక్ష్యం. భాజపా మాత్రమే పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తుంది” అని అమిత్ షా విమర్శించారు.
అయోధ్యలో రామ మందరం నిర్మాణం కోసం 550 యేళ్లకు పైగా పోరాడిన విషయాన్ని ప్రస్తావించారు. త్వరలో ప్రారంభం కానున్న అయోధ్య రామ మందిరాన్ని ప్రజలు దర్శించుకోవాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందన్నారు. అందుకే ములుగులో సమ్మక్క సారక్క యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు పీఎం ప్రకటించిన విషయాన్ని అమిత్ షా ఈ సందర్భంగా ప్రస్తావించారు.
పసుపు రైతుల కోసం ఎంతో మంది రైతులు ఉద్యమాలు చేస్తే.. తెలంగాణలో పసుపు బోర్డ్ ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు అమిత్ షా. తెలంగాణ ప్రజల ఆకాంక్షల అనుగుణంగా కృష్ణా వాటర్ ట్రిబ్యూనల్ ఏర్పాటు చేసామన్నారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ దళిత విరోది పార్టీ అంటూ పేర్కొన్నారు.