సుదీర్ఘ కసరత్తు అనంతరం తెలంగాణ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. మెుత్తం 35 మందితో మూడో జాబితాను విడుదల చేసింది. ఈసారి పలువురు పార్టీ సీనియర్ నేతలు, కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు కేటాయించింది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలు ఉండగా ఇప్పటి వరకు 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. ఇంకా పెండింగ్‌లో 31 స్థానాలను పెండింగ్ లో ఉంచింది.
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన అంబర్ పేట నియోజకవర్గం నుంచి కృష్ణ యాదవ్ బరిలోకి దిగుతున్నారు. ఆంథోల్ నుంచి మాజీ మంత్రి బాబుమోహన్‌కు టికెట్ ఇచ్చారు. ఉప్పల్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, సనత్ నగర్ నుంచి మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు.
మూడో జాబితాలో ఒకే ఒక్క మహిళకు టికెట్ కేటాయించారు. హుజూర్ నగర్ నుంచి శ్రీలతారెడ్డికి అవకాశం ఇచ్చారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి స్థానం నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.
బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా
- మంచిర్యాల – వీరబెల్లి రఘునాథ్
- ఆసిఫాబాద్ (ఎస్టీ) – అజ్మీరా అత్మారామ్ నాయక్
- బోధన్ – మోహన్ రెడ్డి
- బాన్సువాడ – యెండల లక్ష్మీనారాయణ
- నిజామాబాద్ రూరల్ – దినేశ్ కులచారి
- మంథని – సునీల్ రెడ్డి
- మెదక్ – విజయ్ కుమార్
- నారాయణఖేడ్ – సంగప్ప
- అందోల్ (ఎస్సీ) – బాబు మోహన్
- జహీరాబాద్ (ఎస్సీ) – రామచంద్ర రాజ నర్సింహ
- ఉప్పల్ – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
- ఎల్బీ నగర్ – సామ రంగారెడ్డి
- రాజేంద్ర నగర్ – శ్రీనివాస్ రెడ్డి
- చెవేళ్ల – కేఎస్ రత్నం
- పరిగి – మారుతి కిరణ్
- ముషీరాబాద్ – పుస రాజు
- మలక్ పేట్ – సురేందర్ రెడ్డి
- అంబర్ పేట – కృష్ణ యాదవ్
- జూబ్లీహిల్స్ – దీపక్ రెడ్డి
- సనత్ నగర్ – మర్రి శశిధర్ రెడ్డి
- సికింద్రాబాద్ – సారంగపాణి
- నారాయణపేట – పాండు రెడ్డి
- జడ్చర్ల – చిత్తరంజన్ దాస్
- మక్తల్ – జలంధర్ రెడ్డి
- వనపర్తి – అశ్వథామ రెడ్డి
- అచ్చంపేట(ఎస్సీ) – సతీశ్ మాదిగ
- షాద్ నగర్ – అందే బాబయ్య
- దేవరకొండ(ఎస్టీ)- కేస్లావత్ లాలు నాయక్
- హుజుర్ నగర్ – చల్లా శ్రీలతా రెడ్డి
- నల్గొండ – శ్రీనివాస్ గౌడ్
- ఆలేరు – పడాల శ్రీనివాస్
- పరకాల – ప్రసాద్ రావు
- పినపాక(ఎస్టీ)- బాలరాజ్
- పాలేరు – నూన రవి కుమార్
- సత్తుపల్లి(ఎస్సీ) – రామలింగేశ్వర్ రావు