నామినేషన్ దాఖలుకు శుక్రవారంతో గడువు ముగుస్తుండగా తెలంగాణ బీజేపీ తన తుది జాబితాను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. మొత్తం నాలుగు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలతో పాటు మొత్తం 14 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై పూర్తిస్థాయి కసరత్తు చేసిన అనంతరం దీన్ని విడుదల చేసింది.
ఇప్పటికే, మూడు జాబితాలలో 100 మంది అభ్యర్థులను బిజెపి ప్రకటించింది. మరో 8 నియోజకవర్గాలను మిత్రపక్షం జనసేనకు కేటాయించింది. దానితో మిగిలిన 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు.
బెల్లంపల్లి (ఎస్సీ రిజర్వుడ్)- కొయ్యల ఎమాజీ, పెద్దపల్లి- దుగ్యాల ప్రదీప్, సంగారెడ్డి దేశ్‌పాండే రాజేశ్వర్ రావు, మేడ్చల్- ఏనుగు సుదర్శన్ రెడ్డి, మల్కాజ్గిరి- ఎన్ రామచందర్ రావు, శేరిలింగంపల్లి- రవికుమార్ యాదవ్, నాంపల్లి-రవిచంద్ర, చంద్రాయన్ గుట్ట- కే మహేందర్‌ను తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ రిజర్వుడ్)- గణేష్ నారాయణ్, దేవరకద్ర- కొండా ప్రశాంత్ రెడ్డి, వనపర్తి- అనుజ్ఞ రెడ్డి, అలంపూర్ (ఎస్సీ రిజర్వుడ్)- మేరమ్మ, నర్సంపేట్- కే పుల్లారావు, మధిర (ఎస్సీ రిజర్వుడ్)- పెరుమార్పల్లి విజయ్ రాజు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.