కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో, మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూతో సహా మరింత కఠినమైన చర్యలను ప్రకటించింది. రెవెన్యూ, అటవీ, విపత్తు నిర్వహణ, సహాయ, పునరావాస శాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, అవసరమైన అవసరాలకు మినహా కర్ఫ్యూ సమయంలో ప్రజలను రోడ్లపైకి రావడానికి అనుమతించబడదు.
రెస్టారెంట్లు, తినుబండారాలు ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు, 50 శాతం సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతిస్తారు. రెస్టారెంట్లు లోపల ఉన్న వ్యక్తుల సంఖ్యను బోర్డుపై ప్రదర్శించాలని కూడా నిర్దేశించారు. అయితే, హోమ్ డెలివరీలపై ఎటువంటి పరిమితి లేదని తాజా మార్గదర్శకాలలో పేర్కొన్నారు.
10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలకు సంబంధించిన కార్యకలాపాలు మినహా పాఠశాలలు, కళాశాలలు ఫిబ్రవరి 15 వరకు మూసివేయబడతాయి. దేశీయ ప్రయాణాల కోసం, ఒకరు రావడానికి 72 గంటల ముందు జారీ చేసిన డబుల్ టీకా సర్టిఫికేట్ లేదా తప్పనిసరి ఆర్ టి పిసిఆర్ నివేదికను పొందాలి.
థియేటర్లు, ఆడిటోరియంలు కూడా ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల మధ్య, 50 శాతం సామర్థ్యంతో మాత్రమే పనిచేస్తాయి. జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, వెల్నెస్ సెంటర్లు, బ్యూటీ సెలూన్లు మూసివేస్తారు. హెయిర్ కటింగ్ సెలూన్లు ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు కరోనాకు తగిన ప్రవర్తనకు కట్టుబడి 50 శాతం హాజరుతో పనిచేయడానికి అనుమతిస్తారు.
వినోద పార్కులు, జంతు ప్రదర్శన శాలలు, మ్యూజియంలు, కోటలను మూసివేస్తారు. షాపింగ్ మాల్స్ 50 శాతం సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతిస్తారు. మాల్ యజమానులు భవనం వెలుపల లోపల ఉన్న వ్యక్తుల సంఖ్యను ప్రదర్శించే బోర్డును ఉంచాలి. వారు లోపల ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం హాజరుతో పనిచేయాలని, వివిధ షిఫ్టులలో పని గంటలను తగ్గించాలని సూచించారు. పూర్తిగా టీకాలు వేసిన ఉద్యోగులు మాత్రమే కార్యాలయానికి హాజరుకావాలి. వివాహ కార్యక్రమాలు, సామాజిక, మత, రాజకీయ సమావేశాలకు హాజరయ్యే వారి సంఖ్యను ప్రభుత్వం 50కు పరిమితం చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సందర్శకులను నిషేధించారు. సమావేశాలను వర్చువల్ మోడ్‌లో నిర్వహిస్తారు.
Trending
- కూతుళ్లతో కలిసి తిరుమలకు పవన్
- ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల దాడి
- మహాత్ముడికి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
- 14 రాష్ట్రాలకు రూ. 5858.60 కోట్లు కేంద్రం వరద సాయం విడుదల
- భవనాల కూల్చివేతపై మార్గదర్శకాలు జారీ చేస్తాం
- ఒక తమ్ముడిగా కొండా సురేఖకు అండగా ఉంటా.. బీజేపీ ఎంపీ
- హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం
- నటుడు గోవిందాకు బుల్లెట్ గాయం