‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ పక్కన సహాయ నటుడి పాత్ర పోషించిన బండారు జగదీష్‌ను (కేశవ) పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ జూనియర్ ఆర్టిస్టు మరో వ్యక్తితో ఉండగా జగదీశ్ ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని జగదీశ్ బెదిరించినట్లుగా ఆరోపణ. బెదిరింపులకు పాల్పడిన జగదీశ్ ను పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
జగదీశ్ వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఆ మహిళ (జూనియర్ అర్టిస్టు) గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆ మహిళ గత నెల 27న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా జగదీశ్ ఫొటోలు తీశాడు. ఆ తర్వాత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు ఆమెను బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ కేసులో అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న బండారు జగదీష్ ను బుధవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీష్ కు సినీ రంగంలో పరిచయం ఉందని పోలీసులు వెల్లడించారు.