రెండు తెలుగు రాష్ట్రాలలోని మూడు రియల్ ఎస్టేట్ కంపెనీలపై గత వారం ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన సోదాలలో రూ 800 కోట్ల మేరకు నల్లధనం కనుగొన్నారు. ఈ సందర్భంగా రూ 1.64 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలోని పలు ప్రాంతాలలో ఈ గ్రూప్కార్యకలాపాలపై దాడులు జరిపారు. నవ్య డెవలపర్స్, రాగ మయూరి ఇన్ఫ్రా, స్కంధాన్షి ఇన్ఫ్రా కంపెనీలపై గత వారంలో ఐటీ దాడులు జరిపారు. లెక్కల్లో చూపని రూ. 1.64 కోట్ల క్యాష్‌ను దాడులలో స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఐటీ అధికారులు ప్రకటించారు.
నల్లధనం దొరక్కుండా ఉండడానికి ఈ కంపెనీలు ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉపయోగించినట్లు ఐటీ డిపార్ట్మెంట్ తెలిపింది. ట్రాన్సాక్షన్లు పూర్తయ్యాక డేటా ఆటోమేటిక్‌గా మాయం కావడానికి ఈ సాఫ్ట్వేర్ వినియోగించినట్లు వివరించింది.
రిజిస్ట్రేషన్ వాల్యూకి మించిన మొత్తాన్ని ఈ కంపెనీలు కస్టమర్ల నుంచి క్యాష్ రూపంలో తీసుకుంది. ఇలా వచ్చిన బ్లాక్‌మనీని మళ్లీ కొత్త ప్రాపర్టీలు కొనడానికి, ఇతర ఖర్చులకు వెచ్చించినట్లు ఐటీశాఖ వెల్లడించింది.