ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిలీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్సమెంట్ డైరెక్టరేట్ (ఇడి) శుక్రవారం మూడవ సారి సమన్లు జారీచేసింది. జనవరి 3న ఢిల్లీలోని ఇడి కార్యాలయంలో హాజరుకావాలని కేజ్రీవాల్‌ను ఇడి ఆదేశించింది.
ఈ నెల 21న హాజరుకావాలని ఇడి రెండవ సమన్లు జారీచేసినప్పటికీ 10 రోజుల పాటు విపాసన ధ్యానంలో పాల్గొనేందుకు కేజ్రీవాల్ బుధవారమే వెళ్లిపోయారు. జనవరి 3న కూడా ఇడి ఎదుట హాజరుకాని పక్షంలో కేజ్రీవాల్‌పై నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీచేసే అవకాశం ఉంది.
రెండవ సమన్లకు లేఖ ద్వారా సమాధానమిచ్చిన కేజ్రీవాల్ ఇవి రాజకీయ దురుద్దేశంతో జారీచేసివవని, చట్టవిర్ధుమైనవని ఆరోపించారు. తన జీవితాన్ని నిజాయితీగా, పారదర్శకంగా జీవించానని, దాచడానికి తన వద్ద ఏమీ లేదని ఇడికి రాసిన ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు.
మొదట నవంబర్ 2న హాజరుకావాలని కేజ్రీవాల్‌కు ఇడి సమన్లు జారీ చేసింది. అయితే ఐదు రాష్ట్రాలలో అసెంబీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళుతూ ఆయన సమన్లను వాపసు తీసుకోవాలని ఇడిని కోరారు.
కాగా, ఈడీ పంపిన సమన్లు చట్టవిరుద్ధమని, రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని కేజ్రీవాల్ చెబుతున్నారు. ”లీగల్‌గా వచ్చే ఏ సమన్లకైనా కట్టుబడి ఉండేదుకు సిద్ధంగా ఉన్నాను. ఈడీ సమన్లు మాత్రం గతంలో మాదిరిగానే చట్టవిరుద్ధం, రాజకీయ దురుద్దేశాలతో కూడుకున్నవి. సమన్లు ఉపసంహరించుకోవాలి. నా జీవితమంతా నిజాయితీగా, జవాబుదారీతనంతోనే వ్యవహిరిస్తూ వచ్చాను. ఏదీ దాచలేదు” అని కేజ్రీవాల్ గత సమన్లపై వ్యాఖ్యానించారు.
కాగా, ఈ కేసులో సీబీఐ గత ఏప్రిల్‌లో కేజ్రీవాల్‌ను ప్రశ్నించింది. అయితే గత ఏడాది ఆగస్టులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఆయన పేరును నిందితుడిగా పేర్కొనలేదు. ఇదే కేసులో ఆప్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మరో నేత సింజయ్ సింగ్ ఇప్పటికే అరెస్టయ్యారు.