వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఓడించేందుకు ఇటీవల జరిగిన `ఇండియా’ కూటమి సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా మల్లిఖార్జున్ ఖర్గే పేరును ప్రతిపాదించడంతో పాటు వారణాసిలో మోదీని ఓడించేందుకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేవరకు పలు సూచనలు చేసిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్కి అదే రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకురాలు గట్టి ఛాలెంజ్ విసిరారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీ చేయాలంటూ పశ్చిమబెంగాల్ బీజేపీ నాయకురాలు అగ్నిమిత్ర పాల్ దీదీకి సవాల్ విసిరారు. ఇండియా కూటమి నాలుగో సమావేశం సందర్భంగా వారణాసిలో మోదీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ పోటీ చేయాలని మమతా బెనర్జీ ప్రతిపాదించింది.
ఈ నేపథ్యంలోనే అగ్నిమిత్ర పాల్ దీదీకి ఛాలెంజ్ విసిరారు. ‘మమతా బెనర్జీ వారణాసి నుంచి ఎందుకు పోటీ చేయరు? కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కాకుండా వారణాసి నుంచి లోక్సభ స్థానానికి ప్రధాని మోదీపై పోటీ చేసే దమ్ము మమతాకు ఉంటే ఆ పని చేయాలి. మీరు (దీదీని ఉద్దేశిస్తూ) ప్రధాని కావాలనుకుంటున్నారు కదా? అప్పుడు మన ప్రధానిపై పోటీ చేయండి’ అని అగ్నిమిత్ర పాల్ వ్యాఖ్యానించారు.