ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనలో పలు అద్భుత వినయాసాలు చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను మోదీ ఆస్వాదించారు. అంతేగాక, సముద్రంలో సాహసోపేతమైన స్నార్కెలింగ్ కూడా చేశారు. సముద్ర గర్భంలోకి వెళ్లి అక్కడి పగడపు దిబ్బలు, జీవరాశులను ప్రత్యక్షంగా వీక్షించారు ప్రధాని మోదీ. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోడీ తన ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో పంచుకున్నారు.
మరోవైపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం తన బిజీ షెడ్యూల్‌ను పక్కన పెట్టి సముద్రం ఒడ్డున సరదాగా సమయాన్ని గడిపారు. అక్కడ బీచ్‌లో కుర్చీ వేసుకొని కాసేపు సేద తీరారు. ఈ సందర్భంగా సముద్రంలో సాహసోపేత డైవింగ్ చేశారు.
ముఖానికి ట్యూబ్, డైవింగ్ మాస్క్‌ను ధరించి సముద్రంలోపల ఈత కొట్టారు. ఈ డైవింగ్‌ను ‘స్నోర్కెలింగ్’ అని అంటారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘ఇది ఎంతో అద్భుతమైన అనుభవం’ అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు.
‘లక్షదీవుల సౌందర్యం, అక్కడి ప్రజల మమకారం చూసి నేనింకా సంభ్రమాశ్చర్యంలోనే ఉన్నా. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణంలో ఈ దీవులు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం నేను మరింత కష్టపడి ఎలా పనిచేయాలో ఈ వాతావరణం నాకు నేర్పింది. సాహసాలు చేయాలనుకునేవారు మీ జాబితాలో లక్షద్వీప్ ను కూడా చేర్చుకోండి’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
కాగా, స్నార్నెలింగ్ అనేది సముద్రంలో చేసే ఓ తరహా డైవింగ్ లాంటిది. స్నార్నెల్ అనే ట్యూబ్, డైవింగ్ మాస్క్‌ను ముఖానికి ధరించి సముద్రం లోపల ఈత కొడతారు. ఈ స్నార్కెలింగ్‌తో సముద్ర గర్భంలో పర్యావరణాన్ని జీవరాశులను దగ్గర్నుంచి వీక్షించవచ్చు. ప్రధాని మోడీకి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.