కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు అప్రమత్తం కావాలని కేంద్రం ఆదేశించింది. కనీసం 48 గంటలకు సరిపడే విధంగా బఫర్ స్టాక్ ఉండేలా చూసుకోవాలని వెల్లడించారు.
ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. కరోనా బాధితులకు వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, అలాగే వైద్య కేంద్రాల వద్ద మెడికల్ ఆక్సిజన్ లభ్యత ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.
కనీసం 48 గంటలకు సరిపడే విధంగా బఫర్ స్టాక్ ఉండేలా చూసుకోవాలని వెల్లడించారు. పిఎస్ఎ ప్లాంట్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల పనితీరును నిర్ధారించుకోవడంతో పాటు, సిలిండర్ల లభ్యతను సరిచూసుకోవాలని కోరారు. లిక్విడ్ మెడికల్ ఆక్సీజన్ (ఎల్ఎంఒ) ట్యాంకులు తగినస్థాయిలో ఉండాలని, వాటి రీఫిల్లింగ్‌లో ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించింది.
ఆక్సిజన్ సంబంధ సమస్యలు, సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు ఆక్సిజన్ కంట్రోల్ రూమ్‌లను పునరుద్ధరించాలి. అలాగే వైద్య కేంద్రాల వద్ద ఆక్సిజన్ నిర్వహణ నిమిత్తం శిక్షణ పొందిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. దేశంలోని అన్ని జిల్లాలు కూడా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు తగినంత సంఖ్యలో అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.
బ్యాకప్ స్టాక్‌లు, పటిష్టమైన రీఫిల్లింగ్ సిస్టమ్‌లతో పాటు ఆక్సిజన్ సిలిండర్లను తగినన్ని ఇన్వెంటరీగా ఉండేలా చూసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించారు. అన్ని రాష్ట్రాలు లైఫ్ సపోర్ట్ పరికరాల లభ్యతను నిర్ధారించుకోవాలని, అలాగే ప్రైవేట్ హెల్త్ సెంటర్స్ తో సమన్వయం చేసుకుంటూ ఉండాలని చెప్పారు.
ఆక్సిజన్ సంబంధిత సమస్యలు, సవాళ్లను సత్వరంగా పరిష్కరించేందుకు గతంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ కంట్రోల్ రూమ్‌లను తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు. ఇన్ పేషెంట్ కేర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే ఆక్సిజన్ డెలివరీ పరికరాలను వినియోగించేప్పుడు ఇన్ఫెక్షన్ నివారణ ప్రొటోకాల్‌ను అనుసరించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.