మహారాష్ట్రలో నిర్మితమైన దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెనను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. 21.8 కిలోమీటర్ల పొడవుండే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్(ఎంటీహెచ్ఎల్) ముంబైలోని సేవ్రి, రాయగఢ్ జిల్లాలోని నవా శేవాను కలుపుతుంది. సుదీర్ఘ దూరం విస్తరించుకుంటూ సాగే ఈ వంతెన ఆద్యంతం రంగురంగుల విద్యద్దీపాల కాంతులతో కనులపండువగా ఉండగా ప్రధాని రిబ్బన్ కట్ చేసి ఆవిష్కరించారు.
ఈ సీ బ్రిడ్జిని అటల్ బిహారీ వాజ్‌పేయి సేవ్రీ న్యావా షేవా అటల్ సేతుగా వ్యవహరిస్తారు. దేశంలో అతి పొడవు బ్రిడ్జిగా , సీ బ్రిడ్జిగా దీనికి గుర్తింపు దక్కింది. ఈ బ్రిడ్జిపై ఆరు వరుసలలో ప్రయాణాలు సాగుతూ ఉంటాయి. రూ.17,840 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయీ పేరుమీదుగా ‘అటల్ సేతు’ అని నామకరణం చేశారు.
రెండు పాయింట్ల మధ్య ప్రస్తుతం ఉన్న గంటన్నరగా ఉన్న ప్రయాణ సమయం ఈ వంతెన ద్వారా 20 నిమిషాలకు తగ్గుతుంది. ఆరు లైన్లతో నిర్మించిన ఈ బ్రిడ్జి.. 16.5 కిలోమీటర్లు సముద్రం మీదుగానే వెళ్తుంది.
బ్రిడ్జి ద్వారా ముంబై, నవీ ముంబై మధ్య దూరం, ప్రయాణ సమయం మరింత తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ వంతెనపై ఓపెన్ రోడ్ టోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాహనదారులు టోల్ బూతుల వద్ద ఆగకుండానే 100 కిలోమీటర్ల వరకు వేగంతో వెళ్లిపోవచ్చు.
రెండు పాయింట్ల మధ్య ప్రస్తుతం ఉన్న గంటన్నరగా ఉన్న ప్రయాణ సమయం ఈ వంతెన ద్వారా 20 నిమిషాలకు తగ్గుతుంది. ఆరు లైన్లతో నిర్మించిన ఈ బ్రిడ్జి.. 16.5 కిలోమీటర్లు సముద్రం మీదుగానే వెళ్తుంది. బ్రిడ్జి ద్వారా ముంబై, నవీ ముంబై మధ్య దూరం, ప్రయాణ సమయం మరింత తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ వంతెనపై ఓపెన్ రోడ్ టోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాహనదారులు టోల్ బూతుల వద్ద ఆగకుండానే 100 కిలోమీటర్ల వరకు వేగంతో వెళ్లిపోవచ్చు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరుమీద నిర్మించిన ఈ వంతెన ట్రాఫిక్‌ను సులభతరం చేయడం, రవాణాను మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా ఆర్థికాభివృద్ధికి ఇంజిన్‌గా కూడా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. భూకంపాలను సైతం తట్టుకొనేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతను ఉపయోగించినట్లు వెల్లడించారు.
ఈ వంతెన నిర్మాణ పనులకు ప్రధాని 2016 డిసెంబర్లో పునాదిరాయి వేశారు. ప్రధాని మోడీ శుక్రవారమే ఇక్కడ అండర్‌గ్రౌండ్ రోడ్ టన్నెల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ టన్నెల్ 9.2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. నిర్మాణ వ్యయం రూ 8700 కోట్లుగా అంచనావేశారు. ఈ భూగర్భ టన్నెల్ నిర్మాణ పనులతో ఈస్టర్న్ ఫ్రీవే కు మెరైన్ డ్రైవ్ ప్రాంతానికి అనుసంధానం ఏర్పడుతుంది.