యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (34 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68), శివమ్ దూబే (32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63 నాటౌట్) దుమ్మురేపే అర్ధ శతకాలతో.. అఫ్ఘానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీ్‌సను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకొంది. ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 6 వికెట్లతో అఫ్ఘాన్‌ను చిత్తు చేసింది.
తొలుత అఫ్ఘాన్ 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. గుల్బదిన్ నైబ్ (57) పోరాటం వృథా అయింది. అర్ష్‌దీప్ 3 వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ చెరో 2 వికెట్లు దక్కించుకొన్నారు. ఛేదనలో భారత్ 15.4 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది. కోహ్లీ (16 బంతుల్లో 29) వేగంగా ఆడాడు. కరీమ్ 2 వికెట్లు పడగొట్టాడు. అక్షర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
ఛేదనలో జైస్వాల్, దూబే మూడో వికెట్‌కు 42 బంతుల్లో 92 పరుగులు జోడించడంతో టీమిండియా అలవోకగా నెగ్గింది. రోహిత్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. కానీ, జైస్వాల్, కోహ్లీ రెండో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొన్నారు. ఏడాది తర్వాత టీ20ల్లోకి వచ్చిన విరాట్.. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడితో అలరించారు.
కోహ్లీ రెండు ఫోర్లతో జోరు చూపగా.. ఫరూఖీ బౌలింగ్‌లో జైస్వాల్ రెండు సిక్స్‌లు బాదాడు. ముజీబుర్ వేసిన 5వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడిన యశస్వి 19 పరుగులు రాబట్టాడు. అయితే, నవీనుల్ బౌలింగ్‌లో కోహ్లీ క్యాచవుట్ కావడంతో.. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 69/2తో నిలిచింది. ఈ దశలో జైస్వాల్‌కు జత కలసిన దూబే ఎడాపెడా షాట్లతో పరుగుల వరద పారించాడు.
10వ ఓవర్లో నబీ బౌలింగ్‌లో జైస్వాల్ సింగిల్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. దూబే హ్యాట్రిక్ సిక్స్‌లతో 21 పరుగులు పిండుకొన్నాడు. అయితే, గెలుపునకు 19 పరుగులు కావాల్సి ఉండగా.. జైస్వాల్, జితేష్ (0)ను కరీమ్ అవుట్ చేశాడు. కానీ, దూబే, రింకూ (9 నాటౌట్) మరో 26 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించారు.
గుల్బదిన్తోపాటు లోయరార్డర్ బ్యాటర్లు చెలరేగడంతో.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్ పోరాడగలిగే స్కోరు చేసింది. గుర్బాజ్ (14)ను బిష్ణోయ్ స్వల్ప స్కోరుకే అవుట్ చేసినా.. వన్‌డౌన్‌లో వచ్చిన గుల్బదిన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
కెప్టెన్ ఇబ్రహీం (8)తో కలసి రెండో వికెట్‌కు 33 పరుగులు జోడించిన నైబ్.. నబీ (14)తో 4వ వికెట్‌కు 31 రన్స్ భాగస్వామ్యంతో జట్టును ఆదుకొన్నాడు. కానీ, నైబ్‌ను బోల్తా కొట్టించిన అక్షర్.. జట్టుకు కీలక బ్రేక్ అందించాడు. డెత్‌ఓవర్లలో నజీబుల్లా (23), కరీమ్ (20), ముజీబుర్ (21) బ్యాట్లు ఝుళిపించడంతో అఫ్ఘాన్ 170 మార్క్ దాటింది.