బంగ్లా యుద్ధం – 28
నిర్జనమైన, చీకటి ప్రదేశంలో ఒక ట్రక్కు ఆగిపోయింది. ఒకరినొక్కరు కట్టివేయబడి, బాగా కొట్టడంతో స్పృహ కోల్పోయిన మహిళల కుప్పను కిందకు పారవేయడానికి తెరిచారు. బహుశా ఆ మహిళలు వందల సంఖ్యలో ఉండాలి. ఆ తర్వాత వెంటనే సైన్యం వారిని క్యూలలో కూర్చోబెట్టి, వయసుల వారీగా వేరు చేసింది.
సంతానం పొందడానికి అవకాశం లేనివారిగా భావించిన వారిని అక్కడికక్కడే కాల్చి చంపారు. అయితే పిల్లలను కనే సామర్థ్యం ఉన్నవారిని రాబోయే కొన్ని నెలలపాటు అత్యాచార శిబిరంలో నివసించడానికి అక్కడే ఉంచారు. ఆర్మీ కమాండర్ తన సైనికులకు “ఈ స్త్రీలను గర్భం ధరించాలి” అని ఆజ్ఞ ఇచ్చాడు.
తమ దేశానికి, మతానికి విధేయతగల పాకిస్తాన్ను నిర్మించాలనే ఆలోచన వారిది. దర్శకుడు మృత్యుంజయ్ దేవవ్రత్ చిత్రం, “చిల్డ్రన్ ఆఫ్ వార్” నుండి ఈ గగుర్పాటు కలిగించే సన్నివేశం కేవలం కల్పితం. ఇది బయట ప్రపంచంలో పెద్దగా వెలుగు చూడని 1971లో కొత్తగా ఏర్పడిన దేశం జ్ఞాపకాలు, దురదృష్టకర అనుభవాలను గురించి అరుదుగా తెలిసే సంఘటనలను మొరటుగా ఉదాహరించినట్లు అవుతుంది.
బాంగ్లాదేశ్ ఒక దేశంగా ఆవిర్భవించడంలో అందుకు ఆ దేశంలోని మహిళలు, యువతులు దారుణమైన మూల్యం చెల్లించవలసి వచ్చింది. బహుశా ప్రపంచంలో మరే దేశం ఆవిర్భావంకు అంతటి భయంకర మూల్యం చెల్లింపవలసి రాలేకపోవచ్చు. యుద్ధం సమయంలో మహిళలపై అత్యాచారాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తుండటం అసాధారణం కాకపోవచ్చు.
అయితే ఇంత దారుణ స్థాయిలో మరెక్కడైనా జరిగిందా? అన్న అనుమానం రాక తప్పదు. లెక్కలేనంత మంది మహిళలు అత్యంత దురదృష్టకరమైన దుస్థితికి లోను కావలసి రావడమే కాకుండా, తత్ఫలితంగా ఎందరో పిల్లలకు జన్మ ఇవ్వవలసి వచ్చింది. ఆ విధంగా జన్మించిన వారిని `యుద్ధ పిల్లలు’గా భావించవచ్చు.
పురాతన కాలంలో వేలాది సందర్భాలలో ఇటువంటి దారుణమైన అత్యాచారాలకు పాల్పడ్డారు. అధికారాల కోసం మధ్యయుగ పోరాటం, రెండు ప్రపంచ యుద్ధాలతో సహా 20వ శతాబ్దపు యుద్ధాలు. అత్యాచారం క్రూరత్వం ద్వారా సమూహంపై తీవ్ర భయాందోళనలు, నష్టం కలిగించడంచే ప్రయత్నం చేశారు.
బెంగాలీ జాతీయతను తుడిచి పెట్టేందుకు అత్యాచారం
బంగ్లాదేశ్లో అయితే, విముక్తి యుద్ధంలో అత్యాచారంను బెంగాలీ జాతీయతను తుడిచిపెట్టే ప్రయత్నంలో పశ్చిమ పాకిస్తానీ సైన్యం ద్వారా పుట్టిన పిల్లలను ఉత్పత్తి చేయడానికి ఒక `దైహిక సాధనం’గా ప్రయోగించారు.
మార్చి 1971లో తూర్పు పాకిస్తాన్లో సాంస్కృతిక, భాషా గుర్తింపు సమస్య ఒక కొలిక్కి వచ్చినప్పుడు, అధ్యక్షుడు యాహ్యా ఖాన్ బెంగాలీలను “నిజమైన ముస్లింలుగా” తయారు చేయాలని బహిరంగ ఆదేశాలు జారీ చేశారు. అధికారిక పత్రాలు లేనప్పటికీ, “స్వచ్ఛమైన పాకిస్థాన్” నిర్మించడం కోసం బంగ్లాదేశ్ ఏర్పాటుకు మద్దతుగా ఉన్న తూర్పు పాకిస్తాన్లోని ముస్లిం మలహిళను, హిందూ మహిళలను గర్భం దాల్చేటట్లు చేయమని యాహ్యా ఖాన్, జనరల్ టిక్కా ఖాన్లు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయని పలు నివేదికలు సూచిస్తున్నాయి.
ఫలితం వినాశకరమైనది. బాధాకరమైనది. పాకిస్తాన్ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడానికి సైన్యం ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టలేదు. మహిళలను వేటాడారు. వారిని వారి ఇళ్లు, పాఠశాలలు, వీధులు, పడక గదుల నుండి కూడా ఎత్తుకెళ్లారు. అనాగరికంగా అత్యాచారాలకు పాల్పడ్డారు.
అధికారిక అంచనా ప్రకారం 200,000 నుండి 400,000 మంది మహిళలు పాకిస్తానీ సైన్యం, వారికి మద్దతు ఇస్తున్న బీహారీ, బెంగాలీ రజాకార్, అల్-బదర్ మిలీషియాలచే అత్యాచారానికి గురయ్యారు.
కొత్తగా పెళ్లయిన మహిళపై జరిగిన దాడి కేసును రచయిత ఆబ్రే మీనెన్ ఇలా వివరించారు:
“పెళ్లి జంట కోసం ఏర్పాటు చేసిన గదిలోకి ఇద్దరు [పాకిస్థానీ సైనికులు] వెళ్లారు. మిగిలిన వారు కుటుంబంతో పాటు ఉండిపోయారు. వారిలో ఒకరు తన తుపాకీతో వారిని కట్టడి చేసి ఉంచారు. వారు గట్టిగా అరుస్తూ ఇస్తున్న ఆజ్ఞను విన్నారు. వరుడి స్వరం నిరసన వ్యక్తం చేసింది. ఆ తర్వాత వధువు కేకలు వేసేంత వరకు నిశ్శబ్దం నెలకొంది. తర్వాత కొన్ని మూగబోయిన కేకలు తప్ప మళ్లీ నిశ్శబ్దం నెలకొంది”.
“కొన్ని నిమిషాల్లో ఒక సైనికుడు బయటకు వచ్చాడు. అతని యూనిఫాం చిందరవందరగా ఉంది. అతను తన సహచరులతో నవ్వాడు. అతని స్థానంలో మరో సైనికుడు ఆ గదిలోకి వెళ్ళాడు. అంతే, ఆ ఆరుగురూ కొత్తగా వివాహం జరిగిన ఆ ఉరి యువతిపై అత్యాచారానికి పాలపడి, హడావుడిగా వెళ్లిపోయారు. స్పృహ కోల్పోయి రక్తం కారుతున్న తన కుమార్తె మంచంపై పడి ఉండడాన్ని తండ్రి గుర్తించారు. ఆమె భర్త తన వాంతిపై మోకరిల్లి నేలపై వంగి ఉన్నాడు”.
“అనేక మంది మహిళలు అత్యాచార శిబిరాల్లో నివసించవలసి వచ్చింది. అక్కడ పదేపదే అత్యాచారం జరిగింది. జర్నలిస్ట్ సుసాన్ బ్రౌన్మిల్లర్ తన రచనలో ఒక రాత్రిలో దాదాపు 80 సార్లు అత్యాచారానికి గురైన మహిళలు ఉన్నారని రాశారు. మహిళల దుస్థితి అక్కడితో ముగియలేదు. యుద్ధం ముగిసి, బంగ్లాదేశ్ పుట్టిన తర్వాత, ఈ మహిళలు సామాజిక గౌరవానికి నల్ల మచ్చగా భావించి బహిష్కరణకు గురయ్యారు”.
బాధిత మహిళల పట్ల కనికరం చూపించని బంగ్లా
బంగ్లాదేశ్ ప్రభుత్వం వారిని తమ సమాజంలో చేర్చుకోవడానికి ప్రయత్నించింది. కొత్త అధ్యక్షుడు ముజిబుర్ రెహ్మాన్, యుద్ధ అత్యాచారం నుండి బయటపడిన వారిని బిరంగోనాస్ (యుద్ధ వీరులు) అని పేర్కొన్నారు. వారి కుటుంబాలు, సాధారణంగా సమాజం వారిని అంగీకరించాలని కోరారు. అయితే, ఈ మహిళల పరిస్థితి వాస్తవికత చాలా భిన్నంగా ఉంది.
ఈ క్రూరమైన యుద్ధం ద్వారా జన్మించిన (యుద్ధ పిల్లలు) వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. మహిళలపై జరిగిన మారణహోమం దాడి వల్ల దాదాపు 25,000 మంది శిశువులు జన్మించారని అధికారిక అంచనాలు సూచిస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్ ప్రభుత్వం అత్యాచారానికి గురైన మహిళల మనోవేదనల పట్ల సానుభూతి చూపినప్పటికీ, వారు అత్యాచారానికి గురైన మహిళల నుండి జన్మించిన పిల్లల పట్ల ఎటువంటి కనికరం చూపలేదు.
“పాకిస్థానీల రక్తాన్ని మోసే శిశువులు ఎవరూ బంగ్లాదేశ్లో ఉండనివ్వరాదు” అని ముజిబుర్ రెహ్మాన్ ప్రకటించినట్లు కధనాలు వచ్చాయి. ఒక స్త్రీవాద రచయిత్రితో మాట్లాడుతూ, “ఆ కలుషితమైన రక్తాన్ని” తన దేశంలో ఉంచడం తనకు ఇష్టం లేదని ఆయన చెప్పిన్నట్లు చెబుతున్నారు. యుద్ధ శిశువులకు ఉన్న కళంకం కారణంగా వారిని ఏమి చేయాలనే విషయంలో విస్తృతమైన గందరగోళం ఏర్పడింది.
గర్భిణీ స్త్రీలకు ఆలస్యంగా అబార్షన్లు చేయడంతో విదేశాలలో ఉన్న కుటుంబాలు పిల్లలను దత్తత తీసుకోవడంలో సహాయం చేయాలని అనేక అంతర్జాతీయ సంస్థలను కోరారు. దాదాపు 5000 మంది మహిళలు తమ ‘అవాంఛిత’ శిశువులను అసురక్షిత పద్ధతుల ద్వారా గర్భస్రావం చేశారు. మరికొందరు అబార్షన్లు చేయించుకోవడం ఇష్టం లేదని, తమకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్లో అనేక మంది యుద్ధ శిశువులు ఉన్నారు. వారి గుర్తింపు, వారి పుట్టుకతో ముడిపడి ఉన్న చరిత్ర, తమ దేశం ఆవిర్భవించడానికి తాము చెల్లించిన మూల్యం గురించి కూడా స్పృహ కలిగి ఉన్నారు. ప్రస్తుత కాలంలో యుద్ధ అత్యాచారాలు సర్వసాధారణంగా మారాయి. యుద్ధం సమయంలో శత్రువుపై భీబత్సాహం, క్రూరత్వం ప్రదర్శించడానికి ఆచ్యచారం సాధనాన్ని ప్రయోగించడం 1971 నాటి బంగ్లాదేశ్ యుద్ధంలో చివరిసారిగా జరగలేదు.
నేటికీ, ఆధునిక ప్రజాస్వామ్య సమాజాలను సృష్టించినప్పటికీ, మహిళలు యుద్ధకాల దాడులకు అత్యంత సున్నితమైన లక్ష్యాలుగా కొనసాగుతున్నారు. ఇటీవలి కాలంలో ఇదే విధమైన దాడి సాంకేతికతను ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఇస్లామిక్ స్టేట్, రోహింగ్యాలపై మయన్మార్ సైన్యం అమలు చేసింది. 2014 నాటికి, దాదాపు 1,500 మంది యాజిదీలు, క్రైస్తవ మహిళలు ఇస్లామిక్ స్టేట్ చేత లైంగిక బానిసత్వంలోకి నెట్టబడ్డారు. బాధితులను క్రమశిక్షణలో ఉంచడానికి, వారిని లొంగదీసుకునేలా చేయడం కోసం దాడి చేసేవారికి లైంగిక వేధింపులు హేతుబద్ధంగా కనిపిస్తున్నాయి.