ఎటువంటి అంచనాలు లేకుండా సంక్రాంతికి విడుదలైన హనుమాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎదురులేకుండా దూసుకుపోతుంది. ఐదో రోజు కూడా రికార్డ్ కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. మంగళవారం రోజు ఇండియా వైడ్‌గా హనుమాన్ మూవీ రూ.11.90 కోట్లకు వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. మంగళవారం నాటితో ఈ మూవీ రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది.
సంక్రాంతి సినిమాల్లో గుంటూరు కారం తర్వాత రూ. 100 కోట్ల మైలురాయిని అందుకున్న రెండవ చిత్రంగా హనుమాన్ నిలిచింది. ఓవర్సీస్లో హనుమాన్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడు మిలియన్ల మార్క్‌ను దాటింది. తెలుగు రాష్ట్రాల కు ధీటుగా ఓవర్సీస్లో ఈ సూపర్ హీరో మూవీ వసూళ్లను రాబడుతోంది. సీజన్ ముగిసిన మౌత్ టాక్ కారణంగా హనుమాన్ వసూళ్లు మాత్రం నిలకడగా కొనసాగుతోన్నాయి.
ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా హనుమాన్ రూ. 109 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రూ. 59 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. హిందీలోనూ ఈ సినిమా చక్కటి వసూళ్లను రాబడుతోంది. హనుమాన్ హిందీ వెర్షన్ రూ. 18 కోట్ల వరకు గ్రాస్, రూ. 10 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. మంగళవారం నాడు హిందీ వెర్షన్‌కు రూ. 2 కోట్లకుపైనే కలెక్షన్స్ వచ్చాయి.
వరల్డ్ వైడ్‌గా హనుమాన్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 29 కోట్ల వరకు జరిగింది. రూ. 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సూపర్ హీరో మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రీమియర్స్ నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో మూడు రోజుల్లోనే ఈ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టింది. మొత్తంగా ఐదు రోజుల్లో హనుమాన్కు రూ. 30 కోట్ల వరకు లాభాలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఫిబ్రవరి వరకు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ బరిలో లేకపోవడం, మిగిలిన సంక్రాంతి సినిమాలకు మిక్స్డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో హనుమాన్ రూ. 50 కోట్లకుపైనే నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
హనుమాన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి మూవీ. డివోషనల్ అంశాలకు సూపర్ హీరో బ్యాక్‌డ్రాప్‌ను జోడించి ప్రశాంత్ వర్మ ఈ మూవీని తెరకెక్కించాడు. ఆంజనేయుడి సాయంతో సూపర్ పవర్స్ పొందిన యువకుడిగా తేజా సజ్జా యాక్టింగ్ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరిని అలరిస్తోంది.
అంజనాద్రి అరాచకాలను సృష్టిస్తున్న వారిని హనుమంతు ఎలా ఎదురించాడు? సూపర్ హీరో కావాలని కలలు కన్న మైఖేల్ నుంచి హనుమంతుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాన్నది హనుమాన్ మూవీ. హనుమాన్కు జై హనుమాన్ పేరుతో సీక్వెల్ రాబోతోంది.
వచ్చే ఏడాది ఈ సీక్వెల్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. హనుమాన్ సినిమాలో తేజా సజ్జాకు జోడీగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు.