దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బృందం ఇప్పటివరకు సుమారు రూ.37వేల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో రూ. 12,400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. మరో పారిశ్రామిక దిగ్గజం జేఎస్డబ్ల్యూ గ్రూప్ రూ. 9 వేల కోట్ల రూపాయలతో పంప్డ్ స్టో రేజీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఒప్పందం చేసుకుంది.
ఐదేళ్లలో రూ. 8,000 కోట్లతో బ్యాటరీల ఉత్పత్తి సంస్థ స్థాపించి 6వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వెల్లడించింది. మరోవైపు విప్రో, టాటా సన్స్, అమెజాన్ తదితర పారిశ్రామిక సంస్థలతోనూ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
గ్రూప్ భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో పాటు నాలుగు కీలక ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకుంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సమక్షంలో రూ. 12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశారు. అదానీ ఎంటర్ ప్రైజెస్ చందనవెల్లిలో రూ. 5,000 కోట్లతో 100 మెగావాట్ల డేటా సెంటర్ను నెలకొల్పనుం ది.
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మరో రూ. 5,000 కోట్లతో 1350 మెగావాట్ల సామర్థ్యంతో నాచారం, కోయబస్తీగూడంలో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. అంబుజా సిమెంట్స్ రూ. 1400 కోట్లతో దాదాపు 70 ఎకరాల్లో ఏటా 60 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల సిమెంటు పరిశ్రమను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
అయిదారేళ్లలో ప్లాంటు పూర్తయ్యాక సుమారు 4వేల మందికి ఉపాధి లభిస్తుందని అదానీ గ్రూప్ పేర్కొంది. అదానీ ఎయిరోస్పేస్ పార్కులో కౌంటర్ డ్రోన్, క్షిపణుల పరిశోధన, అభివృద్ధి, డిజైన్, ఉత్పత్తిపై రానున్న పదేళ్లలో వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది.
ఇంటిగ్రేటెడ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిపాదనకు గౌతం అదానీ అంగీకరించారు. పరిశ్రమలకు అవసరమైన వసతులు, ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని గౌతమ్ అదానీకి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు కొనసాగిస్తామని. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు బాగున్నాయని అదానీ పేర్కొన్నారు.