బంగ్లా యుద్ధం – 29
యుద్ధం జరిగిన 50 సంవత్సరాల తరువాత, 1971 బంగ్లాదేశ్, భారతదేశం, పాకిస్తాన్లలో ప్రజల స్థాయిలో, ప్రభుత్వాల స్థాయిలో వారి జీవితాలు, విధానాలపై విశేష ప్రభావం చూపుతూ వస్తున్నది. వారి విధానాల రూపకల్పనలో చెరగని ముద్ర వేస్తున్నది. 1971 గురించి బంగ్లాదేశ్‌లో విముక్తి, భారతదేశంలో విజయం, పాకిస్తాన్లో ఓటమిని వెల్లడి చేసే విభిన్న కథనాలను అవకాశం లభించింది.
1971పాకిస్తాన్ విభజన దేశ విభజన అనంతరం మూడు దేశాలలోని నూతన తరాలకు శాశ్వత వారసత్వాన్ని మిగిల్చింది. బంగ్లాదేశ్‌లో, అణచివేత పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా బెంగాలీ ప్రజల పోరాటంగా ఈ యుద్ధం గుర్తుకు వస్తుంది. భారతదేశం, పాకిస్తాన్లకైతే తమ మధ్య జరిగిన మూడవ ఇండో-పాకిస్తాన్ యుద్ధంగా గుర్తుకు వస్తుంది. అయితే ఈ కధనం పట్ల చాలా మంది బంగ్లాదేశీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. తాము భావించే విముక్తి యుద్ధంలో తమ పాత్రను చెరిపివేసినట్లు భావిస్తున్నారు.
యుద్ధ సమయంలో ముఖ్యమైన పాత్ర పోషించిన షేక్ ముజిబుర్ రెహమాన్ స్వాతంత్య్రం తర్వాత అధికారం చేపట్టాడు. జమాత్-ఎ-ఇస్లామీని నిషేధించాడు. పాకిస్తాన్ సైన్యంతో “సహకరించిన” ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేయడానికి, ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించే ప్రత్యేక చట్టాలను ప్రవేశపెట్టాడు.
1975లో షేక్ ముజిబుర్ రెహమాన్ హత్య తర్వాత, జనరల్ జియావుర్ రెహమాన్ అధికారాన్ని చేజిక్కించుకొని విముక్తి యుద్ధంపై ప్రజల కథనాన్ని మార్చడం ప్రారంభించాడు. సంఘర్షణలో వివిధ సైన్యాలు పోషించిన పాత్రను ప్రదర్శించడానికి ప్రయత్నించాడు. అందులో బెంగాలీ ప్రజల పాత్రను తెరమరుగు చేసే కృషి చేసాడు. అనేకమంది అనుమానిత యుద్ధ నేరస్తులను కూడా విడుదల చేశాడు జమాతే ఇస్లామీపై నిషేధాన్ని ఎత్తివేశాడు.
తరువాతి సంవత్సరాలలో, అతని పార్టీ, బి ఎన్ పి యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తన సభ్యులలో కొంతమందిని కీలకమైన స్థానాలు కల్పించాడు. దానితో బాధితులు మరింత ఇబ్బంది పడవలసి వచ్చింది. 1990ల ప్రారంభంలో, పౌర సమాజ వ్యక్తుల బృందం 1971 నాటి హంతకులు, వారికి సహకారం అందించినవారి నిర్ములన కమిటీని ఏర్పాటు చేశారు.
వారు అనుమానిత యుద్ధ నేరస్థులకు వ్యతిరేకంగా మాక్ ట్రయల్స్‌ను నిర్వహించారు. దీనికి చట్టపరమైన చట్టబద్ధత లేనప్పటికీ, కమిటీ బి ఎన్ పి ప్రభుత్వంపై ఒత్తిడికి దారి తీయడంతో, నిర్వాహకులపై దేశద్రోహ అభియోగాలు నమోదు చేశారు.
1980లలో అవామీ లీగ్‌కు నాయకత్వం వహించిన ముజీబ్ కుమార్తె షేక్ హసీనా, బి ఎన్ పి కి వ్యతిరేకంగా అధికారం కోసం తన పోరాటంలో కమిటీ సృష్టించిన వేగాన్ని ఉపయోగించుకుంది. ఆమె 1971లో జరిగిన దానిని పూర్తిగా అవామీ లీగ్ నేతృత్వంలోని పోరాటంగా మళ్లీ చూపించాలని ప్రయత్నించింది.
2008 ఎన్నికల ప్రచారంలో, షేక్ హసీనా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా యుద్ధ నేరస్తులను న్యాయస్థానం ముందుకు తీసుకువస్తానని హామీ ఇచ్చింది. అయితే ప్రారంభించబడిన యుద్ధ నేరాల విచారణలు వివాదాలకు తెరలేపింది. ప్రత్యర్థులను శిక్షించడానికి, అధికారం నుండి దూరంగా ఉంచడానికి షేక్ హసీనా వారిని ఉపయోగిస్తున్నారని కొందరు విమర్శకులు ఆరోపించారు.
ఈ రోజు, షేక్ హసీనా 1971 యుద్ధం గురించి తన కథనాన్ని ఎంతగా పటిష్టం చేయగలిగారు అంటే, ఎవరైనా తన పార్టీని విమర్శిస్తే, వారు విముక్తి పోరాటాన్ని విమర్శించినట్లు చూపడం ద్వారా, అటువంటి వారిని ప్రభుత్వ వ్యతిరేకంగా చిత్రీకరిస్తున్నారు.
ఇదిలావుండగా, 2008 సుప్రీంకోర్టు తీర్పు పౌరసత్వ హక్కులను పొడిగించే వరకు యుద్ధం తర్వాత దేశం లేని వారుగా ఉన్న బిహారీ కమ్యూనిటీ తమ కమ్యూనిటీ సభ్యులపై దాడి చేయడం, చంపడం, అత్యాచారం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎప్పటికీ న్యాయస్థానం ముందుకు తీసుకురాలేమని ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం దృష్టిలో అధికారిక బెంగాలీలపై జరిగిన నేరాలను మాత్రమే పరిగణలోకి తీసుకొంటున్నారు.
నేడు, వేలాది మంది బీహారీలు శిబిరాల్లో నివసిస్తున్నారు. వారు అట్టడుగు పరిస్థితులలో నివసిస్తున్నారు, యుద్ధంలో వారి ఆరోపించిన పాత్ర కారణంగా “ఒంటరిగా ఉన్న పాకిస్తానీలు” , పాకిస్తాన్ అనుకూల సహకారులు అందించిన వారుగా వేసిన ముద్రతో నివసిస్తున్నారు.
భారత్ సైనిక పరాక్రమానికి నిదర్శనం
భారతదేశంలో, ఈ యుద్ధం దేశం అత్యుత్తమ విజయమని, తన సైనిక పరాక్రమానికి, ఆధిపత్యానికి నిదర్శనంగా, 1947లో పాకిస్తాన్ భారతదేశాన్ని “విచ్ఛిన్నం” చేసినందుకు ప్రతీకారంగా గుర్తుచేసుకుంటున్నది.
1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధంలో ఓడిపోయి, పాకిస్తాన్‌తో జరిగిన మొదటి రెండు యుద్ధాల్లో మాత్రమే కాల్పుల విరమణను సాధించి న భారత్ కు 1971లో సాధించిన విజయం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. నేడు, రాజకీయ నాయకులు, అలాగే సాయుధ దళాలు, పాకిస్తాన్‌తో భారతదేశపు సౌర్య, పరాక్రమాలను సూచించడానికి యుద్ధం గురించి ప్రస్తావనలు చేస్తూనే ఉన్నారు.
1971 భారతీయులుగా మనల్ని మనం చూసుకునే విధానాన్ని ఈ యుద్ధం మార్చివేసింది. యుద్ధం వరకు, మమ్మల్ని ఎవ్వరు సైనికంగా సమర్థులుగా చూడలేదు. కానీ 1971 తర్వాత, అంతర్జాతీయ దౌత్యంలో మనం చాలా పలు సందర్భాలలో కఠినంగా వ్యవహరించడానికి దోహదపడింది. భారత దేశ ప్రతిష్ట కూడా ఇనుమడించింది.
అణచివేతకు గురైన బెంగాలీల రక్షకునిగా భారతదేశాన్ని ప్రపంచం గుర్తించింది. భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు పెరిగే సమయంలో ఈ యుద్ధ ప్రస్తావనను తప్పకుండా తీసుకొస్తాము. అయితే, 1971 సమకాలీన భారతదేశానికి కొన్ని అనర్ధాలను కూడా మిగిల్చింది. భారత భూభాగాల్లోకి ప్రవేశించిన పెద్ద సంఖ్యలో శరణార్థులు, భారత ప్రభుత్వ అంచనా ప్రకారం సుమారు కోటి మంది తరువాత ప్రధాన అంతర్గత సమస్యగా మారారు.
శరణార్థులు, అతిధేయ జనాభా మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి, ఓపర్ బంగ్లా (బెంగాల్ మరొక వైపు) నుండి వచ్చిన శరణార్థులు శాశ్వతంగా స్థిరపడవచ్చనే భయంతో, ఇప్పటికే విస్తరించిన వనరులపై భారం పడుతుందని ఆందోళన స్థానికులతో వెల్లడైనది. 1980వ దశకంలో బంగ్లా వలస ప్రజలు తమ రాష్ట్రంలో జనాభా నిష్పత్తిని మార్చివేస్తున్నారంటూ అస్సాంలో పెద్ద ఉద్యమం జరగడం తెలిసిందే. 1971 తర్వాత కూడా ఆ వలసలు కొనసాగుతూ ఉండడం, పలు సరిహద్దు జిల్లాల్లో వారే ఆధిపత్యం వహిస్తూ ఉండడంతో సమస్యలు మరింత జటిలమయ్యాయి.
భారతదేశంలోని అస్సాంలో, చాలా మంది బెంగాలీలు సంవత్సరాలుగా స్థిరపడ్డారు. వారి ఉనికి వివాదాస్పదంగా ఉంది. ఇటీవల, జాతీయ పౌరుల రిజిస్టర్ తుది జాబితాను మార్చి 24, 1971తో విడుదల చేశారు. రిజిస్టర్లో చేర్చడానికి కటాఫ్ తేదీగా తూర్పు పాకిస్తాన్లో పాకిస్తాన్ తన సైనిక చర్యను ప్రారంభించటానికి ముందు రోజును నిర్ణయించారు.
దాదాపు 20 లక్షల మంది ప్రజలు, వారు లేదా కుటుంబ సభ్యులు మార్చి 1971కి ముందు రాష్ట్రంలో నివసించారని నిరూపించలేని వారిని రిజిస్టర్ నుండి మినహాయించారు. ఇది అమలు జరిగితే వారిని దేశం లేని వారుగా మారుస్తుంది.
మరిపించే ప్రయత్నం చేస్తున్న పాక్
పాకిస్తాన్లో, 1971లో ఏమి జరిగిందో తమ ప్రజలు మరచిపోయేటట్లు అక్కడి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. అవమానకరమైన ఓటమిగా భావించి, పాఠ్యపుస్తకాలలో యుద్ధం గురించి ప్రస్తావించినా, తూర్పు పాకిస్తాన్లో సైనిక అణచివేత, దాని ఫలితంగా ఏర్పడిన దురాగతాల గురించి ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడుతున్నది.
బంగ్లాదేశ్‌లో విముక్తి దినంగా సంబరాలు చేస్తూకొంటున్న డిసెంబర్ 16ను పాకిస్థానీలు ఢాకా పతనం లేదా పాకిస్తాన్‌ని ముక్కలు చేసిన రోజుగా గుర్తు చేసుకొంటున్నారు. 1971 గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు సైనిక చర్య ముందు బెంగాలీయేతరుల హత్యల గురించి ఎక్కువగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ, 1971 యుద్ధం గురించి తమ ప్రజలు మరచిపోయేటట్లు చేస్తున్నా, ఆ తర్వాత వారి జాతీయ విధానాలు రూపొందించుకోవడంలో కీలక అంశంగా మారింది. తూర్పు పాకిస్తాన్‌ను కోల్పోవడం దేశంలో “ఇంకెప్పుడూ” అనే మనస్తత్వాన్ని సృష్టించింది. ఇలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తకూడదని నిర్ణయించుకున్న పాకిస్థాన్ తన రక్షణ వ్యయాన్ని పెంచింది. జనవరి 1972 నాటికి అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో అణు కార్యక్రమాన్ని ప్రారంభించింది.
బెంగాలీలలో స్వాతంత్య్రం కోసం సామూహిక ఉద్యమానికి దారితీసిన పాకిస్తాన్ అణచివేత విధానాలపై కొన్ని అతిశయోక్తులతో వక్రభాష్యం కూడా చేస్తున్నది. విధానాలపై ప్రతిబింబం. ఉదాహరణకు భారతీయ-ప్రభావిత హిందూ ఉపాధ్యాయులు విద్యార్థులను మార్చడం, తూర్పు పాకిస్తాన్లో వేర్పాటువాద భావాలను పెంపొందించడం వంటివి.
పంజాబ్ లో ప్రత్యేక సిఖ్ దేశం కోసం ఖలిస్తాని వేర్పాటు వాదం, జమ్మూ, కాశ్మీర్ లో వేర్పాటు ఉద్యమాలు పాకిస్థాన్ ప్రోద్బలంతోనే ప్రారంభం అయ్యాయని అందరికి తెలిసిందే. తూర్పు పాకిస్తాన్లో భారతదేశం అనుసరించిన వ్యూహాలను పాకిస్తాన్ ఆశ్రయించిందని అంటూ ఈ వేర్పాటు వాదులకు తమ మద్దతును పాక్ నేతలు సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
పాకిస్తానీ ప్రభుత్వంతో పోరాడుతున్న బెంగాలీలకు భారతదేశం మద్దతు ఇచ్చినట్లే, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సమూహాలకు మద్దతు అందిస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. ఈ రోజు, కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తోందని భారతదేశం ఆరోపించినట్లే, లాహోర్‌లోని ఆర్మీ మ్యూజియంలో, స్వాతంత్య్రం కోసం బెంగాలీలు జరిపిన ఉద్యమాన్ని భారతదేశ ప్రాయోజిత ఉగ్రవాదం అని చిత్రీకరించే ఫలకాన్ని ఉంచింది.