బిహార్‌లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెర పడింది. ఎట్టకేలకు బీజేపీ మద్దతుతో తిరిగి ఎన్డీయేలోకి చేరిన నితీశ్ కుమార్ 9వ సారి ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్‌తో 18 నెలల పాలనకు ముగింపు పలికిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు.
దీంతో ఆయన మహాఘటబంధన్ కూటమి నుంచి వైదొలగి బీజేపీలో చేరారు. దీంతో ఆర్జేడీతో జేడీయూ బంధం తెగిపోయింది. అంతకు ముందు రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు లేఖ సమర్పించిన తర్వాత నితీష్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.వరుసగా కూటమిలను మార్చడంలో దేశంలోనే దిట్టగా పేరొందిన బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీష్ కుమార్ ఆదివారం మరోసారి పదవికి రాజీనామా చేసి, తిరిగి బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరి తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
పట్నాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. నితీశ్‌తో పాటు మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకరం చేశారు. జేడీయూ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరు, హిందూస్థాన్ ఆవామ్ మోర్ఛా నుంచి ఇద్దరు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, విజయేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రవణ్ కుమార్ మంత్రులుగా ప్రమాణ స్వీకరం చేశారు. డిప్యూటీ సీఎంలుగా బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి, విజయ్‌కుమార్ సిన్హా, హిందూస్థాన్ ఆవామ్ మోర్చా నుంచి సంతోశ్‌కుమార్, సుమన్ మంత్రులుగా ప్రమాణం చేశారు. స్వతంత్ర ఎమ్మెల్యే డాక్టర్ ప్రేమ్‌కుమార్ కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
ఇప్పటికే 8సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన ఇప్పుడు 9వ సారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. దీంతో మన దేశంలోనే ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజకీయ నాయకుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. నితీష్ తొలిసారిగా 2000 ఏడాదిలో 7 రోజుల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అప్పటి నుంచి మొదలుకొని, ఇప్పుడు తొమ్మిదోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు.
“నేను సీఎం పదవికి రాజీనామా చేశాను. ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ని కోరాను. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ఈ నిర్ణయానికి వచ్చాం. ఈ రోజుతో ఇండియా కూటమితో తెగదింపులు చేసుకుంటున్నా. రాష్ట్రంలో కొత్త కూటమితో ముందుకు వస్తాం” అని రాజీనామా అనంతరం నితీష్ కుమార్ తెలిపారు.
రాజీనామా చేయడానికి రాజ్‌భవన్‌కు బయలుదేరిన సమయంలో నితీష్ కుమార్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ఫోన్ కాల్ అందినట్లు తెలుస్తోంది. మహా కూటమి నుంచి బయటికి రావాలని నిర్ణయం తీసుకున్నందు వల్ల ఆయనను అభినందించారు. ఎన్డీఏ కూటమిలో చేరాలంటూ లాంఛనంగా ఆహ్వానించారు.
ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడంతో అధికారంలో ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు భాగస్వాములుగా ఉన్న మహాకూటమి ప్రభుత్వం కుప్పకూలింది. వేంటనే బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏలో చేరి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 122 స్థానాలు కావాలి. బిజెపి- జెడియు కలిసి 123 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బిజెపిికి హెచ్ ఎఎం పార్టీ మద్దుతు కూడా ఇస్తుండడంతో ఈ కూటమి సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.