రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ డబుల్ సెంచరీ సాధించాడు. 231 బంతుల్లో ద్విశతకాన్ని సాధించాడు. శనివారం ఆట చివర్లో 104 పరగుల వద్ద రిటైర్డ్ హట్‌గా వెనుదిరిగిన జైస్వాల్ ఆదివారం తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. టీ20 తరహాలో బ్యాటింగ్ చేస్తూ విరుచుకుపడ్డాడు. వరుసగా రెండు టెస్టు మ్యాచుల్లో డబుల్ సెంచరీలు చేశాడు.
విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన జైస్వాల్ రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లోనూ డబుల్ సెంచరీ చేశాడు. జో రూట్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 231 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సర్లు సాయంతో డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. యశస్వి టెస్టు కెరీర్లో అతడికి ఇది రెండో ద్విశతకం. ఇక భారత్ తరఫున ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతి వాటం బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో 545 పరుగులు చేసిన జైస్వాల గంగూలీ (534 రన్స్) రికార్డును బ్రేక్ చేశాడు. తాజా ద్విశతకంతో యశస్వి జైస్వాల్ మరో ఘనత అందుకున్నాడు. వరుసగా రెండు టెస్టు మ్యాచుల్లో డబుల్ సెంచరీలు సాధించిన మూడో భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. అతడి కంటే ముందు వినోద్ కాంబ్లీ, విరాట్ కోహ్లీ లు మాత్రమే ఇలా వరుసగా రెండు టెస్టుల్లోనూ ద్విశతకాలు చేశారు.
వినోద్ కాంబ్లీ ఇంగ్లండ్‌పై 224, జింబాబ్వేపై 227 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి శ్రీలంకపై వరుసగా 213, 243 పరుగులు బాదాడు. 12 సిక్సర్లు బాదిన జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వసీమ్ అక్రమ్ తో కలిసి చరిత్రకెక్కాడు. 1996లో వసీమ్ అక్రమ్ జింబాబ్వేపై 12 సిక్సర్లు కొట్టాడు.
ఇక జైస్వాల్ సెకండ్ ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించిన ఆరో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో పటౌడీ, సర్దేశాయ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వసీమ్ జాఫర్ ఉన్నారు. సునీల్ గవాస్కర్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు సార్లు ద్విశతకం బాదాడు. జైస్వాల్ ధాటికి మరికొన్ని రికార్డులు నమోదయ్యాయి. ఓ టెస్టులో ఇండియా సాధించిన అత్యధిక సిక్సర్లు రాజ్‌కోట్ టెస్టులోనే నమోదయ్యాయి.
మూడో టెస్టులో మన బ్యాటర్లు 48 సిక్సర్లు బాదారు. గతంలో సౌతాఫ్రికాపై సాధించిన 47 సిక్సర్లు అత్యధికంగా ఉండేవి. అంతేగాక టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో భారత్ సాధించిన అత్యధిక సిక్సర్లు (18) రాజ్‌కోట్ టెస్టులోనే నమోదయ్యాయి.
కాగా టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 430/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. యశస్వీ జైస్వాల్ 236 బంతుల్లో 214 పరుగులు చేశాడు. ఇక సర్ఫరాజ్ ఖాన్ 72 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. శుభ్‌మన్ గిల్ 91 పరుగులు, కుల్దీప్ యాదవ్ 27 పరుగులు చేశారు.
ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్, జో రూట్, టామ్ హర్ట్లీ తలో వికెట తీశారు. ఇంగ్లండ్ విజయానికి 557 పరుగులు చేయాలి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 445, ఇంగ్లండ్ 319 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. తొలిత బెన్ డక్కెట్ రనౌట్ గా వెనుదిరగగా.. తర్వాత జాక్ క్రాలి ఎల్బీడబ్లూ అయ్యాడు.