రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడోవ టెస్ట్‌లో 434 పరుగుల భారీ తేడాతో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. డబుల్ సెంచరీతో యశస్వి జైశ్వాల్ చేయగా.. బౌలింగ్‌తో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండ్‌ను బెంబేలెత్తించారు. దీంతో 557 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 122 పరుగులకే కుప్పకూలింది.
దీంతో 434 పరుగుల భారీ తేడాతో టీమ్ఇండియా గెలుపోందింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 445 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ 319 రన్స్‌కే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌ను టీమ్ఇండియా 430/4 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. యశస్వి జైస్వాల్ (214), సర్ఫరాజ్ (66)సాధించాడు.
అలాగే శుభ్‌మాన్ గిల్ 91, కుల్దీప్ 27, రోహిత్ 19 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో రూట్, టామ్ హర్ట్లీ, రెహాన్ అహ్మద్ తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ బెన్ డకెట్ (4) రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు.
ఆ తర్వాత జాక్ క్రాలే (11)ను ఎల్బీగా ఔటవ్వగా.. ఓలీ పోప్ (3), జో రూట్ (7), జానీ బెయిర్‌స్టో (4), బెన్ స్టోక్స్ (15), బెన్ ఫోక్స్ (16), టామ్ హార్ట్లీ (16) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయ్యలేదు. ఆఖరులో మార్క్ వుడ్ (33) దూకుడుగా ఆడి పర్వలేదనిపించాడు.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5, కుల్దీప్ యాదవ్ 2, బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ తీశారు. ఈ టెస్టులో విజయం సాధించిన టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో జరగనుంది.