విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ భారీ బహిరంగ సభలో ఎన్నికల ప్రచారభేరి మోగిస్తూ ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతున్న యుద్ధ అని తెలిపారు.
కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదని, ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికీ మనందరి ప్రభుత్వం అందించిన అభివఅద్ధి, సంక్షేమం.. పథకాలు కొనసాగాలని అడుగులేస్తున్న మనకు.. వీటన్నింటినీ రద్దు చేయడమే లక్ష్యంగా డ్రామాలు ఆడుతున్న చంద్రబాబు నాయుడు మధ్య జరుగుతున్న ఈ యుద్ధానికి మీరు సిద్ధమేనా? అంటూ జగన్ ప్రశ్నించారు.
”ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున.. పెత్తందారులు మరోవైపున ఉన్నారు. మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు, మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకూ మధ్య జరుగుతున్నదీ యుద్ధం. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధమిది. పేదవాడి భవిష్యత్తు కోసం.. వారి తరఫున నిలబడేందుకు మీరందరూ సిద్ధమేనా?” అంటూ పిలుపిచ్చారు.
ఈ యుద్ధం వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడూ వచ్చేందుకు వస్తున్న నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్కు… ఈ గడ్డమీదే పుట్టి.. ఈ గడ్డమీద మమకారంతో ఇక్కడే ఇల్లు కట్టుకుని, ప్రజలమధ్యే ఉన్న మనకూ మధ్య జరుగుతోందని చెప్పారు. ఇదే వేదిక నుంచి చంద్రబాబు నాయుడుకు ఒక సవాలు విసురుతున్నా…పద్నాలుగేళ్లు సీఎంగా పరిపాలన చేశారు. మూడుసార్లు సీఎం కుర్చీలో కుర్చున్నారు.. మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని చంద్రబాబును అడుగుతున్నా! అంటూ సవాల్ చేశారు.
”అయ్యా చంద్రబాబు.. మీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తొచ్చే పథకం… కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా?” చంద్రబాబు పేరు చెబితే బడికెళ్లే పిల్లలకైనా, కాలేజి వెళ్లే విద్యార్థులకైనా గుర్తుకొచ్చే పథకం ఏదైనా ఒక్కటైనా ఉందా?” పోనీ.. రైతన్నలకూ, అక్కచెల్లెమ్మలు, విద్యార్థులకూ చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే పథకం ఒక్కటంటే ఒక్కటి లేదని విమర్శించారు.
కనీసం అవ్వాతాతలైనా మమ్మల్ని బాగా చూసుకున్నాడు… పింఛన్ ఇంటికైనా పంపే పరిస్థితి ఉందా? అని అడుగుతున్నారు. బాబు పేరు చెబితే ఏ ఒక్కరికీ ఆయన సీఎంగా ఉండగా ఫలాన మంచి చేశాడని, ఫలానా మంచి పథకం తీసుకొచ్చాడని గుర్తుకురాదనీ ధ్వజమెత్తారు.
ప్రజల ఆరోగ్యం కోసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా? తీసుకొచ్చిన ఒక్క స్కీమైనా ఉందా?. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా మధ్యలో నిలబడి మీరు ఏర్పాటు చేసిన పరిపాలన వ్యవస్థ కనీసం ఒక్కటైనా కనిపిస్తోందా? బాగుపడిన స్కూళ్లున్నాయా?. ఆసుపత్రులున్నాయా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.