చంటి బిడ్డలకు తల్లిపాలు ఎంతో మేలు చేస్తాయి. ఆకలితో ఏడుస్తున్న పిల్లలను సముదాయించడాని కూడా తల్లులు వారికి పాలిస్తుంటారు. ఇంట్లో అయితే వారికి అలవాటు పడ్డ వాతావరణంలో బిడ్డలకు స్వేచ్చగా పాలిచ్చే తల్లులు, బహిరంగంగా కొన్ని సందర్భాల్లో పసిబిడ్డలకు పాలు ఇవ్వాల్సి వస్తోంది.
ఆ సమయంలో కొంత మంది కామాంధులు ఆ ఫోటోలు తీసి మహిళల్ని వేధిస్తున్నారు. ఇటువంటి వేధింపులను అడ్డుకట్ట వేసేలా ఇంగ్లాండ్, వేల్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. చనుబాలు పడుతున్న తల్లుల ఫోటోలు/వీడియోలు వారి అనుమతి లేకుండా తీస్తే రెండేళ్ల జైలు శిక్ష పడేలా తమ న్యాయ చట్టాల్లో సవరణ చేశాయి.
ఇక జులియా కూడా ఇటువంటి ఓ సందర్భాన్ని ఎదుర్కొన్నారట. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇది నేరం కాదని కేసు నమోదు చేయలేదు. ఈ సమస్యను ప్రపంచం దృష్టికి తేవాలనుకున్న వీరు మరికొందరితో కలిసి ‘స్టాప్ ది బ్రెస్ పెస్ట్స్’ పేరుతో తల్లులపై వేధింపులకు వ్యతిరేకంగా డిజిటల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. సంతకాల సేకరణ చేపట్టారు.
ఈ ఉద్యమం ఉధృతమై ప్రభుత్వం దృష్టిలో పడింది. యుకె పార్లమెంట్ దిగువ సభ వరకూ వెళ్లింది. చనుబాలు ఇస్తున్న తల్లుల ఫోటోలు, వీడియోలు తీస్తే నేరంగా పరిగణించేలా చట్ట సవరణలు చేసింది. త్వరలో చట్టంగా మారే అవకాశాలున్నాయి.
కాగా, ఈ నిర్ణయాన్ని బాలీవుడ్ నటి నేహా ధూపియా స్వాగతించారు. ఆమె కూడా ‘స్టాప్ ది బ్రెస్ పెస్ట్స్’ తరహాలోనే ‘ఫ్రీడమ్ టు ఫీడ్’ పేరుతో ఆన్లైన్ కమ్యూనిటీని నిర్వహిస్తున్నారు.