భారత్‌ను అంతర్జాతీయ ఎగుమతుల హబ్‌గా మారుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సోమవారం ఢిల్లీలోని భారత్ మంటపంలో భారత్ టెక్స్ 2024ను ప్రారంభిస్తూ రాబోయే పాతికేండ్లలో భారత్‌ను తాము వికసిత్ రాజ్యంగా ఆవిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పేదలు, యువత, రైతులు, మహిళల సంక్షేమం లక్ష్యంగా వికసిత్ భారత్ స్వప్నం సాకారమవుతుందని చెప్పారు.
ప్రభుత్వం చేపడుతున్న చర్యల ఫలితంగా భారత టెక్స్టైల్ రంగంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని ప్రధాని చెప్పారు. 2014తో పోలిస్తే ప్రస్తుతం టెక్స్టైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) రెట్టింపయ్యాయని ప్రధాని మోదీ వెల్లడించారు. దేశంలో జౌళి పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నదని వివరించారు.
2014లో దేశంలో టెక్స్టైల్ మార్కెట్ విలువ రూ. 7 లక్షల కోట్ల కంటే తక్కువగా ఉండగా, ప్రస్తుతం ఆ విలువ రూ. 12 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. గత పదేండ్లలో నూలు, దుస్తులు, అపెరల్ ఉత్పత్తి ఏకంగా 25 శాతం పెరిగిందని తెలిపారు.
కాటా, ఎటువంటి సమాజం ఉండాలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా విస్పష్టంగా ప్రకటించారు. ప్రభుత్వ జోక్యం కనీస మాత్రంగా ఉండే సమాజం సృష్టి తన లక్షమని ప్రధాని వెల్లడించారు. అది ప్రజల సౌభాగ్యానికి దోహదకారి అవుతుందని మోడీ సూచించారు. పేదల కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉండాలని ప్రధాని తెలిపారు.
‘ప్రభుత్వ జోక్యం కనీస మాత్రంగా ఉండే సమాజాన్ని మనం సృష్టించాల్సి ఉంటుంది& ముఖ్యంగా మధ్య తరగతి జీవితాలలో జోక్యాన్ని నేను ఇష్టపడను’ అని ప్రధాని చెప్పారు. కనీస మాత్రపు ప్రభుత్వ జోక్యంతో సమాజం సృష్టికి గడచిన పది సంవత్సరాలుగా తాను పోరాడుతున్నానని, వచ్చే ఐదు సంవత్సరాలలో అదే విధంగా చేస్తుంటానని తెలిపారు.
దేశంలో సౌభాగ్య కోసం ప్రభుత్వం దోహదపడే ఏజెంట్‌గా వ్యవహరించాలని ఆయన నొక్కిచెప్పారు. ఇతరుల జీవితాలలో జోక్యం చేసుకోవడమనే ప్రభుత్వ అలవాటును తప్పించడానికి గత పది సంవత్సరాలుగా తాను పోరాడుతున్నానని, ‘రానున్న ఐదు సంవత్సరాలలో కచ్చితంగా అదే పని చేస్తాను’ అని ఆయన చెప్పారు. దేశంలో అతి పెద్ద ప్రపంచ జౌళి సదస్సులలో ఒకటి భారత్ టెక్స్ 2024.