ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ 2022 టోర్నీలో భారత యువ కిశోరం లక్ష్యసేన్ ప్రపంచ ఛాంపియన్ లో కీన్ యూకు షాక్ ఇచ్చాడు. దేశ రాజధాని ఢిల్లిలోని కేడీ జాదవ్ స్టేడియంలో ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో వరల్డ్ ఛాంపియన్ కీన్‌పై గెలిచి విజేతగా నిలిచాడు.
మూడో సీడ్ లక్ష్యసేన్ ఫైనల్లో లో కీన్ యూపై 24-22, 21-17తేడాతో వరుస సెట్లలో గెలిచి ఛాంపియన్‌గా అవతరించాడు. సింగపూర్‌కు చెందిన లో కీన్‌పై సేన్ 54నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఆద్యంతం పైచేయి సాధించి ఛాంపియన్‌గా నిలిచాడు.
ఒక దశలో తొలిగేమ్‌ను గెలచుకునేక్రమంలో ఇద్దరూ హోరాహోరీగా పోరాడుతూ 22-22తో సమంగా ఉండగా అనూహ్యంగా పుంజుకున్న సేన్ రెండు వరుస పాయిట్లు గెలుచుకుని 24-22తో తొలిగేమ్ గెలచుకుని లో కీన్‌ను దెబ్బతీశాడు.
కాగా గతేడాది జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో శ్రీకాంత్‌పై గెలిచిన లో కీన్ ప్రపంచ విజేతగా నిలిచాడు. ఇదే టోర్నీలో లక్ష్యసేన్ కాంస్య పతక విజేతకగా అరంగేట్ర ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించి రికార్డు సృష్టించాడు. తాజాగా వరల్డ్ ఛాంపియన్‌కు షాక్ ఇచ్చి ఇండియా ఓపెన్‌గా విజేతగా చరిత్ర సృష్టించాడు.
20ఏళ్ల సేన్ కెరీర్లో సూపర్ 500టైటిల్ గెలుచుకోవడం ఇదే ప్రథమం. మరోవైపు పురుషుల డబుల్స్ ఫైనల్లో ఆదివారం సాతిక్ సాయిరాజ్-చిరాగ్‌శెట్టి జోడీ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇండోనేషియాకు చెందిన మూడుసార్లు ప్రపంచ విజేత జోడీ మహ్మద్-హెండ్రా జోడీపై 21-16, 26-24 తేడాతో విజయం సాధించి విజేతలుగా నిలిచారు.
43నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సాత్విక్ జోడీ విజయం సాధించి విజేతలుగా నిలిచారు.ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఎఐ) విజేతలకు టిటర్ వేదికగా అభినందనలు తెలిపింది.