కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీలను భర్తీ చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం సీఈసీ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. ఇంతకు ముందు కమిషనర్లుగా కొనసాగిన అనూప్ చంద్రపాండే పదవీ విరమణ చేయగా అరుణ్ గోయల్ రాజీనామా చేశారు.
లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించే తరుణంలోనే ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ఆమోదం తెలిపారు. ఈ ఖాళీలను మార్చి 13లోగా భర్తీ చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నది.
హోం సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డివోపిటి) సెక్రటరీతో కూడిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ మొదట రెండు పోస్టులకు ఐదుగురి పేర్లతో రెండు వేర్వేరు పేర్లను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. ఆ తర్వాత ప్రధాని మంత్రి నేతృత్వంలోని కమిటీ ఇద్దరు కమిషనర్లను ఖరారు చేసింది.
ఈ కమిటీలో ప్రధానితో పాటు కేంద్రమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ ర ఉంటారు. అయితే, కమిటీలో సభ్యుల సౌకర్యాన్ని బట్టి ఈ నెల 13, 14 తేదీల్లో సెలక్షన్ కమిటీ సమావేశం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నెల 15లోగా నియామకాలను పూర్తి చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.