ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పోరాటానికి సిద్ధపడిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పశ్చిమ్ బెంగాల్‌లోని మొత్తం లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి.. 42మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశారు మమతా బెనర్జీ.
తీయ స్థాయిలో బిజెపిని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా ప్రతిపక్షాల వేదిక ఇండియా వ్యవహరించాలనే సంకల్పానికి ఈ పరిణామం చిక్కుముళ్లకు దారితీసింది. ప్రత్యేకించి ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, టిఎంసిల నడుమ బెంగాల్లో ఇక సీట్ల సర్దుబాట్ల ప్రక్రియ నిలిచిపోయినట్లే అయింది. ఒంటరిపోరే తమ వైఖరి అని, మొత్తం 42 స్థానాలకు పోటీ చేస్తున్నామని మమత స్పష్టం చేశారు.
జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ కూడా ఉన్నారు. ఇక లోక్‌సభ నుంచి బహిష్కారానికి గురైన మహువా మోయిత్రాపై దీదీ మరోమారు నమ్మకం ఉంచారు. ఆమెకు మళ్లీ టికెట్ ఇచ్చారు. బహరంపూర్ నుంచి మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ని బరిలోకి దింపింది. యూసఫ్ పఠాన్.. కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరీతో పోటీపడనున్నారు.
ఇక అవినీతి కేసులో వేటుకు గురైన మహువా మోయిత్రాకు మరోమారు అవకాశం ఇచ్చారు మమతా బెనర్జీ. 2019లో ఆమె పోటి చేసి గెలిచిన కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మోయిత్రా మళ్లీ బరిలో దిగనున్నారు.
హింసాత్మక ఘటనలతో, మహిళల నిరసనలతో గత కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన సందేశ్ ఖాళీ విషయంలో కీలక మార్పే చేసింది టీఎంసీ. 2019లో అక్కడ గెలిచిన నుష్రత్ జహాన్‌కు ఈసారి.. టీఎంసీ లిస్ట్‌లో చోటు దక్కలేదు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే!
పలు తెలుగు సినిమాలలో కూడా నటించిన నటి రచన బెనర్జీకి పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి మమతా బెనర్జీ ఎంపీ సీటు కేటాయించింది. కాగా, గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన హీరోయిన్ నుస్రత్ జహాన్‌కు ఈసారి మొండి చేయి ఎదురైంది.