లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వేళ ప్రధాని మోదీ స్పందించారు. ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. “ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ వచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్డీయే కూటమి ఎన్నికలకు పూర్తిగా సిద్ధమయింది. సుపరిపాలన, అన్ని రంగాల ప్రజలకు చేసిన సేవల ఆధారంగా ప్రజల వద్దకు వెళ్తున్నాం” అని చెప్పుకొచ్చారు.
“పదేళ్ల క్రితం యూపీఏ హయాంలో ప్రజలు మోసపోయారు. కుంభకోణాలు, అవినీతికి ఇండియా కూటమి కేరాఫ్‌గా మారింది. అప్పటి నుంచి ఒక్కో రంగంలో అవినీతిని అరికడుతూ.. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తున్నాం. మా ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరాయి. దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఈ అభివృద్ధికి చేయూతనివ్వడానికి ప్రజలు సిద్ధమయ్యారు” అని తెలిపారు. .
“140 కోట్ల మంది భారతీయులచే ఆధారితమైన మన దేశం అభివృద్ధిలో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. మనం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాము మరియు కోట్లాది మంది ప్రజలు పేదరికం నుండి విముక్తి పొందారు. మా పథకాలు భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చేరుకున్నాయి మరియు సంతృప్తత యొక్క ప్రాముఖ్యత గొప్ప ఫలితాలను అందించింది.” అంటూ మరో ట్వీట్ చేశారు.
అలాగే ” దృఢ నిశ్చయంతో, ఏకాగ్రతతో, ఫలితాల ఆధారిత ప్రభుత్వం ఏమి చేయగలదో భారత ప్రజలు చూస్తున్నారు. మరియు, వారు ఇంకా ఎక్కువ కావాలి. అందుకే భారతదేశంలోని ప్రతి మూలనుండి, సమాజంలోని అన్ని వర్గాలను కలుపుతూ, ప్రజలు ఒకే స్వరంలో చెబుతున్నారు- అబ్ కీ బార్, 400 పార్!” అన్నారు.
ఇప్పుడు దేశ ప్రజలంతా ఒకటే అంటున్నారు. అదే అబ్ కీ బార్.. మోదీ సర్కార్.. 400 పార్ అని. ఇండియా కూటమి చుక్కాని లేని నావలాంటిది. మనల్ని అబాసుపాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని వాళ్లు ఎప్పటికీ చూస్తుంటారు. అవినీతి, కుటుంబ పాలనే వారిని ఘోరంగా దెబ్బ తీసింది. త్వరలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించనుంది. యువత కలలను నెరవేర్చడానికి మా సర్కార్ కృషి చేస్తోందని ప్రధాని భరోసా ఇచ్చారు.
“రానున్న ఎన్నికల్లో మళ్లీ మేమే అధికారం చేపడతాం. వచ్చే 5 ఏళ్లలో వెయ్యేళ్ల భారత భవిష్యత్తును సాక్షాత్కరిస్తాం. మహిళా శక్తి, యువత, రైతులు, కార్మికులు.. ఇలా సమాజంలోని అన్ని వర్గాల అండ మాకుంది”అని పేర్కొంటూ మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.