విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం(ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలు కంపెనీలపై దాడులు చేశారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకుంది. మంగళవారం క్యాప్రికార్నియన్ షిప్పింగ్- లాజిస్టిక్స్ డైరెక్టర్లు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామితో పాటు అనుబంధ సంస్థలు, లక్ష్మీటన్ మారిటైమ్, హిందుస్థాన్ ఇంటర్నేషనల్ తదితర సంస్థలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ క్రమంలో రూ.2.54 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అందులో కొంతమొత్తం వాషింగ్ మెషిన్లో దొరికినట్లు ఈడీ తెలిపింది. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో వెల్లడించింది. అలాగే వివిధ పత్రాలు, పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
భారతదేశం వెలుపల పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్య లావాదేవీల్లో ఈ సంస్థల ప్రమేయం ఉందని..బోగస్ సరకు రవాణా సేవలు, దిగుమతులు తదితరాల పేరిట సింగపూర్‌కు చెందిన గేలాక్సీ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, హోరిజన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్‌ల్లో రూ.1,800 కోట్ల మేర లావాదేవీలు జరిపినట్లు సమాచారం రావదంతో ఈడీ రంగంలోకి దిగింది. ఈ రెండు విదేశీ సంస్థలు ఆంథోనీ డి సిల్వా అనే వ్యక్తి పేరుతో నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.
క్యాప్రికార్నియన్ షిప్పింగ్- లాజిస్టిక్స్, దాని డైరెక్టర్లు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామిల ఇళ్లతోపాటు అనుబంధ సంస్థలు లక్మిటన్ మారీటైమ్, హిందూస్థాన్ ఇంటర్నేషనల్, రాజనందిని మెటల్స్ లిమిట్, స్టావార్ట్ అల్లోయ్ ఇండియా లిమిటెడ్, భాగ్యనగర్ లిమిటెడ్, వినాయక్ స్టీల్స్ లిమిటెడ్, వశిష్ఠ కనస్ట్రక్షన్ ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు.
ఢిల్లీ, హైదరాబాద్, ముంబయి, కోల్‌కతా, కురుక్షేత్ర సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కొద్ది రోజుల కిందట తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే రూ.2.54 కోట్లు స్వాధీనం చేసుకున్న ఈడీ.. అందులో కొంతమొత్తం వాషింగ్ మెషిన్లో దొరికిందని పేర్కొంది. దీనికి సంబంధించిన ఫొటోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. వివిధ పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని, మొత్తం 47 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశామని తెలిపింది. అయితే, సోదాలు ఎప్పుడు జరిగాయి? ఆ నగదు ఎక్కడ పట్టుబడిందనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.