బీఆర్ఎస్ పార్టీ అత్యంత వేగంగా పతనం అవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేసీఆర్ సహకరించలేదని విమర్శించారు. ప్రారంభోత్సవానికి మాత్రమే కేసీఆర్ వచ్చారని తెలిపారు. ఆ తర్వాత ఎప్పుడూ కేసీఆర్ దానిని పట్టించుకోలేదని విమర్శించారు.
తండ్రీ, కొడుకులతోనే తెలంగాణ నాశనమయిందని వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను చూసి జాలిపడాలని అంటూ ఓటమి తర్వాత కూడా ఆయన సీఎం అయినట్టు ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్లుగా దేశంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలపైనే బీజేపీ ప్రచారం ఉంటుందని వెల్లడించారు. సీఎం కావాలనుకున్న కేటీఆర్ ఆశలయ అడియాశలు అయ్యాయని తెలిపారు.
అవినీతి ఆరోపణలు లేకుండా మోదీ పాలన సాగిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యిందని, ప్రజల బ్రతుకులు మారలేదని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఓట్లు పొందేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసిందని విమర్శించారు.
ప్రపంచానికే సాయం చేసే స్థాయికి భారత్ ఎదిగిందని, సంక్షేమం కోసం 34 లక్షల రూపాయలు ఖర్చు చేసింది మోదీ ప్రభుత్వమని తెలిపారు. దేశంలో డిజిటల్ విప్లవం తీసుకుని వచ్చామమని పేర్కొంటూ జీఎస్టీ వ్యాపారస్తులకు వరంగా మారుతోందని తెలిపారు. 1.66 లక్షల కోట్ల రూపాయలు ప్రతి ఏటా జీఎస్టీ ద్వారా దేశానికి ఆదాయం వస్తుందని చెప్పారు. 26,500 కోట్ల డిజిటల్ లావాదేవీలు దేశవ్యాప్తంగా జరిగాయని తెలిపారు.
ఎంఎస్ఎంఈల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చాయని, జనధన్ ఖాతాలతో 2 లక్షల కోట్ల రూపాయలు నేడు వారి సేవింగ్స్ అకౌంట్లలో జమ చేసుకున్నారని తెలిపారు. పన్ను రాయితీ 7 లక్షల రూపాయలకు పెంచింది మోదీ ప్రభుత్వమని చెప్పారు. హైదరాబాద్ మెట్రోకు రూ. 12 వేల కోట్ల ఆర్థిక సాయం చేశామని తెలిపారు.
జాతీయ రహదారుల నిర్మాణంతో ప్రమాదాలు తగ్గిపోయాయన్నారు. ని, 20 వేల కిలోమీటర్ల మేర రైల్వే లైన్లకు విద్యుదీకరణ పూర్తి అయ్యిందని చెప్పారు. రోడ్ నెట్‌వర్క్‌లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నామన్నారు. 101 దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందజేశామని.. 411 కంపెనీలు దేశంలో సెల్‌ఫోన్ ఉత్పత్తి చేస్తున్నాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.