చీర భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోనూ చీరను పలు రకాలుగా ధరిస్తూ వస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా విభిన్న శైలిలో ధరిస్తూ వస్తున్నారు. అయితే, చీరను ధరించడం ద్వారా క్యాన్సర్స్ సోకుతుందని తేలింది. భారతీయ మహిళలు చీర కట్టుకునే విధానంతో క్యాన్సర్ తదితర సమస్యల బారినపడుతున్నట్లుగా అధ్యయనం గుర్తించింది. ముంబయిలోని ఆర్ఎన్ కూపర్‌లాంటి హాస్పిటల్స్‌లో పరిశోధనలు జరిగాయి.
చీరను కట్టుకోవడం ద్వారా స్క్వామస్ సెల్ కార్సినోమా (ఎస్ సి సి) ముప్పు పెరుగుతున్నది. చీర కట్టుకోవడం వల్ల వస్తున్న క్యాన్సర్‌ను చీర క్యాన్సర్‌గా భావిస్తున్నారు. ఇది భారతీయ మహిళల్లో వేగంగా విస్తరిస్తోంది. గత కొన్నేళ్లుగా చీర క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ‘ఓన్లీ మై హెల్త్’లో ఈ కథనం ప్రచురితమైంది.
గ్రామీణ భారతంలో మహిళలు ఏడాది పొడువునా చీరలు ధరిస్తారని ఎస్‌సీపీఎం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సుదీప్ తెలిపారు. నడుముపై చీర కట్టిన గుర్తులుంటాయి. నడుముపై పెట్టీకోట్ వేసుకున్న కాటన్ నాడాలతో కడుతుంటారు. గట్టిగా కట్టుకోవడం వల్ల నడుము భాగంలో రాపిడి ఏర్పడుతుంది. దాంతో చర్మం రంగు సైతం మారుతూ వస్తుంది. చివరకు నల్లని మచ్చలు క్యాన్సర్‌గా మారుతుందని వివరించారు.
విపరీతమైన వేడిలో నివసించే మహిళలకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బీహార్, జార్ఖండ్‌ల మహిళల్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఓ 68 ఏళ్ల మహిళ ఈ కేన్సర్ బారినపడగా, ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. కశ్మీరీ కంగ్రీ దుస్తులతో పాటు టైట్ జీన్స్ సైతం క్యాన్సర్ కారణమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కశ్మీర్లో కాంగ్రీ కేన్సర్ అదేవిధంగా, కాశ్మీర్లో కాంగ్రీ కేన్సర్ అని పిలువబడే చర్మ కేన్సర్‌కి మరో రూపం. చలికాలంలో వెచ్చదనం కోసం కాంగ్రీస్ అని పిలువబడే కుంపటితో నిండిన మట్టి కుండలను వాడే విధానంతో ఈ క్యాన్సర్ వస్తుంది. చాలా బిగుతుగా ఉండే దుస్తులను ఎక్కువసేపు ధరించడంతో రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుందని పేర్కొంటున్నారు.
క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను నివారించడానికి, మీ జీవనశైలిని సరిదిద్దుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు పేర్కొంటున్నారు. చీర ధరించిన అందరిలో క్యాన్సర్ వస్తుందని కాదని, పరిశుభ్రత పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన, పోషకాహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే గంటల తరబడి ఒకే చోట కూర్చోవద్దని.. వీలైనంత వరకు చురుగ్గా ఉండేలా చూసుకోవాలని.. దాంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.