రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఐదు న్యాయ స్తంభాలపై ప్రధానంగా దృష్టిని సారిస్తూ పాంచ్ న్యాయ్(ఐదు న్యాయాలు) పేరిట కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. యువ(యువత), కిసాన్(రైతులు), నారీ(మహిళలు), శ్రామిక్(కార్మికులు), హిస్దేరీ(సమానత్వం) పేరిట పాంచ్ న్యాయ్‌ను కాంగ్రెస్ ప్రకటించింది. వీటి కింద మొత్తం 25 గ్యారెంటీలను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చేర్చింది.
ఉపాధి, సంపద, సంక్షేమం వంటి మూడు ప్రధాన అంశాలను ఆధారం చేసుకుని మేనిఫెస్టోను రూపకల్పన చేసినట్లు కాగ్రెస్ పార్టీ అద్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం ప్రకటించారు. ఉపాధి అంటే ఉద్యోగాల కల్పన..సంపద అంటే ప్రజలకు పంచడానికి ముందు సంపదను సృష్టించడం..సంక్షేమం అంటే పేద బడుగు వర్గాల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడమని ఆయన తెలిపారు.
ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన న్యాయ పత్ర(మేనిఫెసో) విడుదల కార్యక్రమంలో ఖర్గేతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మేనిఫెస్టో రూపకల్పన కమిటీ చైర్మన్ పి చిదంబరం తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా కులగణన, మహిళలకు నగదు బదిలీ, యువతకు ఉపాధి అవకాశాలు, రైతులకు వారి పంటలకు కనీస మద్దతు ధర, బడుగు బలహీన వర్గాలకు ఉచిత వైద్యం, ఎస్సి, ఎస్టి, ఓబిసిల కోసం రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం గరిష్ఠ పరిమితిని తొలగించడం, ట్నిపథ్ పథకం తొలగించి సైన్యంలో పాత నియామక విధానాన్ని పునరుద్ధరిండం వంటి హామీలపై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి
సారించింది.
ప్రధాన అంశాలు
దేశవ్యాప్తంగా ప్రతి కార్మికుడికి రోజుకు రూ. 400 చొప్పున వేతనం లభించేలా హామీ. ప్రభుత్వ ఆస్తుల నిర్మాణంలో ఉపాధి హామీ కార్మికులకు ఉపాధి లక్పించడం, పారిశ్రామిక, కార్మిక చట్టాలలో సంస్కరణలు తీసుకురావడం. డొమెనస్టిక్ హెల్ప్, వలస కార్మికుల ఉపాధిని క్రమబద్ధం చేసేందుకు చట్టాలు చేసి వారికి మౌలిక న్యాయపరమైన హక్కులను పరిరక్షించడం.
అన్ని రాష్ట్రాలలో వలస కార్మకులతో సహా రేషన్ కార్డు హోల్డర్ల జాబితాలను సరిదిద్ది వారికి రేషన్ సక్రమంగా అందేలా చూడడం. పిడిఎస్ విస్తృతిని పెంచి బియ్యం, గోధుమలతోపాటు పప్పులు, వంట నూనె లభించేలా చూడడం. కర్ణాటక, రాజస్థాన్ తరహాలో సబ్సిడీ ధరలకు భోజనం పెట్టేందుకు ఇందిరా క్యాంటీన్ల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించడం.
ప్రభుత్వ ఆసుపత్రులు, క్లినిక్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సంచార ఆరోగ్య యూనిట్లు, డిస్పెన్సరీలు, వైద్య శిబిరాలలో ఉచిత ఆరోగ్య రక్షణ. ఇందులో వైద్య పరీక్షలు, డయాగ్నసిస్, చికిత్స, సర్జరీ, మందులు, పునరావాసం వంటివి కూడా ఉచితంగా జరరుగుతాయి.
రూ. 25 లక్షల వరకు నగదురహిత బీమాను కల్పించే రాజస్థాన్ మోడల్ యూనివర్సల్ హెల్త్‌కేర్ దేశవ్యాప్తంగా ఏర్పాటు. ఆరోగ్య బీమా పథకాలలో ప్రైవేట్ ఆసుపత్రులు, లాభాపేక్షలేని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలను భాగస్వాములను చేయడం. మహిళలందరికీ ప్రసూతి ప్రయోజనాలు కల్పించడం. ఏటా ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపు పెంచడం. ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలతో కూడిన సుపత్రి ఏర్పాటు.